హీరోలే కాదు హీరోయిన్స్ కూడా..?
ఇక వచ్చిన ఈ మూమెంట్ ని కొనసాగిస్తూ ఒకదానికి మించి మరొకటి అనిపించేస్తున్నారు.
బాలీవుడ్ మీద సౌత్ సినిమాల దండయాత్ర కొనసాగుతూనే ఉంది. బాహుబలి ముందు వరకు సౌత్ సినిమాలు కేవలం ప్రాంతీయ సినిమాల్లానే ఉండేవి కానీ బాహుబలి రెండు భాగాలతో సౌత్ సినిమాల మార్కెట్ ని పెంచేసింది. బాహుబలి చూపించిన బాటలోనే మరికొన్ని సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ అవ్వడంతో నేషనల్ లెవెల్ లో ఇంకా చెప్పాలంటే బాలీవుడ్ స్టార్స్ కు ఈక్వల్ క్రేజ్ తెచ్చుకున్నారు సౌత్ హీరోలు. ఇక వచ్చిన ఈ మూమెంట్ ని కొనసాగిస్తూ ఒకదానికి మించి మరొకటి అనిపించేస్తున్నారు.
బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ వరుస సినిమాలతో దూసుకెళ్తుండగా కె.జి.ఎఫ్ తో యష్, పుష్ప తో అల్లు అర్జున్, ఆర్.ఆర్.ఆర్ తో ఎన్.టి.ఆర్, రాం చరణ్ ఇలా అందరు పాన్ ఇండియా స్టార్స్ గా సత్తా చాటుతున్నారు. ఐతే కేవలం హీరోలే కాదు పాన్ ఇండియా రేంజ్ లో హీరోయిన్స్ కూడా ఛాన్సులు అందుకుంటున్నారు. హీరోయిన్స్ విషయంలో కూడా అంతే బాలీవుడ్ హీరోయిన్ ప్రతి ఒక్కరు భారీ డిమాండ్ చేసేవారు.
వారు సౌత్ సినిమాలు చేయాలంటే దాదాపు హీరోలకు ఈక్వల్ రెమ్యునరేషన్ అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఐతే పాన్ ఇండియా సినిమాల మూమెంట్ లో భాగంగా సౌత్ హీరోయిన్స్ కి కూడా హిందీలో ఛాన్సులు వస్తున్నాయి. ఇప్పటికే నయనతార బాలీవుడ్ లో జవాన్ తో హిట్ కొట్టి అక్కడ అవకాశాలు అందుకుంటుండగా సాయి పల్లవి కూడా బాలీవుడ్ లో రెండు సినిమాలకు సైన్ చేసింది. ఇదే దారిలో ఇప్పుడు మలయాళ భామ సంయుక్త మీనన్ కూడా బాలీవుడ్ లో లక్కీ ఆఫర్ అందుకుంది.
మలయాళంలో తన మార్క్ సినిమాలు చేస్తూ అలరించిన సంయుక్త పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ తో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమాతో పాటుగా బింబిసార, సార్, విరూపాక్ష ఇలా వరుస హిట్లతో దూసుకెళ్తుంది. సౌత్ లో ముఖ్యంగా తెలుగులో మోస్ట్ హ్యాపెనింగ్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న సంయుక్త మీద బాలీవుడ్ మేకర్స్ కన్ను పడింది. అమ్మడి సౌత్ క్రేజ్ ని వాడుకునేందుకు హిందీ సినిమాల్లో ఆమెను తీసుకుంటున్నారు. ప్రస్తుతం సంయుక్త నిఖిల్ తో స్వయంభు సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా కూడా పాన్ ఇండియా వైడ్ రిలీజ్ అవుతుంది. ఈ సినిమాతో పాటుగా మహారాగ్ని సినిమాలో నటిస్తుంది. బాలీవుడ్ లో కూడా తన టాలెంట్ తో మెప్పించి అక్కడి ఆడియన్స్ ని బుట్టలో వేసుకోవాలని చూస్తుంది సంయుక్త.
సో పాన్ ఇండియా లెవెల్ లో కేవలం స్టార్ హీరోలే కాదు సౌత్ హీరోయిన్స్ విషయంలో కూడా ఆ క్రేజ్ కొనసాగుతుంది. మరి ఈ అవకాశాలతో ఈ భామలు ఎలా వారి కెరీర్ ని స్ట్రాంగ్ చేసుకుంటారన్నది చూడాలి.