పడిపోయిన కంగనా కెరటం...!

సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసి పడుతూ ఉంటాయి.

Update: 2023-10-30 04:12 GMT

సముద్రంలో కెరటాలు ఉవ్వెత్తున ఎగిసి పడుతూ ఉంటాయి. కింద పడ్డ కెరటం మళ్లీ లేస్తూ ఉంటుంది. ఎంత ఎత్తుకు ఎగసిన కూడా కెరటం కిందకు పడాల్సిందే. కెరటం మాదిరిగా కింద పడ్డా కూడా మళ్లీ పైకి లేచేందుకు ప్రయత్నించాలి అంటూ చాలా మంది అంటూ ఉంటారు. ఇప్పుడు బాలీవుడ్‌ ఫైర్ బ్రాండ్‌ హీరోయిన్‌ కంగనా పరిస్థితి పడిపోయిన కెరటం మాదిరిగా ఉందనే టాక్ వినిపిస్తోంది.

కొన్ని ఏళ్ల క్రితం కంగనా వెండి తెరపై కనిపిస్తే చాలు పదుల కోట్ల వసూళ్లు నమోదు అయ్యేవి. కొన్ని సినిమాలు ఏకంగా వందల కోట్ల వసూళ్లు కూడా తెచ్చి పెట్టాయి. అంతటి క్రేజ్ ను దక్కించుకున్న కంగనా తన మాటలతో ఫైర్ బ్రాండ్‌ ఇమేజ్ ని కూడా సొంతం చేసుకుంది. ఆమె ఏం కామెంట్స్ చేసినా మౌనంగా ఉండటం మంచిది అని చాలా మంది అనుకుంటారు.

ఆమె ను విమర్శించినా, ఆమె గురించి ఏమైనా వ్యాఖ్యలు చేసినా కూడా అంతకు పదిరెట్లు ఆమె నుంచి కామెంట్స్ ను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఎవరు కూడా ఆమె నోట్లో నోరు పెట్టేందుకు ఆసక్తి చూపించేవారు కాదు. సినిమా ల పరంగా కూడా ఆమె దూసుకు పోతున్న సమయంలో బ్యాక్ టు బ్యాక్‌ అట్టర్ ఫ్లాప్స్ ఆమె కెరీర్ ను తీవ్రంగా దెబ్బ తీశాయి.

మణికర్ణిక సినిమా తర్వాత ఇప్పటి వరకు ఆమె నుంచి పర్వాలేదు అన్నట్లుగా అనిపించిన సినిమా రాలేదు. బాలీవుడ్ లో వర్కౌట్‌ అవ్వడం లేదని తమిళ్ లో చంద్రముఖి 2 సినిమాలో నటించింది. ఆ సినిమా లో కంగనా ఎందుకు నటించిందో అర్థం కావడం లేదు అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అంతగా విమర్శలు ఎదుర్కొంటున్న కంగనా రాబోయే సినిమాలపై కూడా పెద్దగా బజ్ లేదు.

ఒకప్పుడు కంగనా రనౌత్ సినిమాలు వస్తున్నాయి అంటే ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన ప్రేక్షకులు ఇప్పుడు ఆమె సినిమాలు వస్తున్నాయంటే లైట్ తీసుకునే స్థాయికి ఆమె క్రేజ్ పడిపోయింది. ఉవ్వెత్తున ఎగసి పడ్డ కెరటం మాదిరిగా కంగనా కెరీర్ ఎగిసింది. అయితే తక్కువ సమయంలోనే కిందికి పడింది.

తిరిగి కంగనా కోలుకుంటుందా, ఆమె నుంచి మళ్లీ వందల కోట్ల సినిమాలు వస్తాయా అంటే డౌటే అంటూ చాలా మంది సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది ప్రముఖ ఫిల్మ్‌ మేకర్స్ తో కంగనా సున్నం పెట్టుకుంది. కనుక వారు ఈమె తో వర్క్‌ చేయడం కు ఆసక్తిగా లేరు. కనుక సొంతంగా సినిమాలు చేసుకోవాల్సిందే... లేదంటే కొత్త వారితో సినిమాలు చేయాల్సి ఉంటుంది. అలా చేస్తే సక్సెస్ లు ఎంత వరకు వస్తాయి అనేది క్లారిటీ లేదు. అందుకే కంగనా తిరిగి పుంజుకోవడం ఎంతవరకు సాధ్యమో చెప్పలేమని చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News