10 ఏళ్లకే హీరోయిన్ అయ్యి 17 ఏళ్లకే తల్లైన స్టార్ హీరోయిన్..!

తెర మీద కనిపించే కథానాయికలు ఎంత అందంగా ఉంటారో వారి తెర వెనుక జీవితం అంత అందంగా ఉండదు

Update: 2023-11-10 02:00 GMT

తెర మీద కనిపించే కథానాయికలు ఎంత అందంగా ఉంటారో వారి తెర వెనుక జీవితం అంత అందంగా ఉండదు. వారి జీవితాల్లో కష్టాలను ఎదుర్కొని తెర మీద ప్రేక్షకులను అలరింపచేయాలని చూస్తారు. ఈ క్రమంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన వారి లైఫ్ స్పాన్ ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటుంది. కొందరికి దశాబ్ద కాలంగా సినిమా ఛాన్స్ లు వస్తే.. కొందరికి మాత్రం ఇలా క్రేజ్ వస్తుందో లేదో అలా ఫేడవుట్ అవుతుంటారు. సినిమాల్లో దర్శకుడు రాసిన కథ ప్రకారం కథానాయిక పాత్ర ఉంటుంది కానీ రియల్ లైఫ్ లో ఆ దేవుడు రాసే స్క్రిప్ట్ ఎలా ఉంటుందో ఊహించడం కష్టం.

ముఖ్యంగా చిన్న వయసులోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఏమి తెలియని వయసులోనే క్రేజ్ తెచ్చుకుని ఆ వెంటనే పెళ్లి చేసుకుని కొంతమంది హీరోయిన్స్ వారి కెరీర్ ని ఆపేయాల్సి వచ్చింది. అలాంటి వారిలో చెప్పుకునే హీరోయిన్స్ లో ఒకరు ఇందిర అలియాస్ మౌసమి. 10 ఏళ్లకే బెంగాలి, హిందీ సినిమాల్లో రాణించిన ఆమె ప్రస్తుతం వెండితెరకు దూరంగా ఉంటుంది.

బెంగాలిలో సూపర్ హిట్ మూవీ బాలికా బధు సినిమాతో తెరంగేట్రం చేసిన నటి ఇందిర. ఆ సినిమాలో నటించేప్పటికి ఆమె వయసు 10 ఏళ్లు. ఆ సినిమాలో మౌసమి పాత్రలో నటించగా ఆమెను ఆ తర్వాత అదే పేరుతో పిలిచారు. బాలికా బధు వ్యవస్థ తీరుని వేలెత్తి చూపిస్తూ 1967లో ఈ సినిమా వచ్చింది. బెంగాల్ లో 75 వారాల పాటు ఆడిన సినిమా ఇది. ఆ సినిమా హిట్ అవడంతో ఆమెకు వరుస ఛాన్స్ లు వచ్చాయి. ఓ పక్క చదువుకోవాలన్న కోరిక కూడా ఉంది. అయితే పదవ తరగతి వయసులో ఆమె తండ్రి అక్క క్యాన్సర్ తో పోరాడుతుండగా ఆమె కోసం పెళ్లి చేసుకుంది. పదో తరగతి పరీక్షలు రాయకుండానే అప్పటి సంగీత దర్శకుడు, సింగర్ హేమంత్ రావు తనయుడు నటుడు జయంత్ ముఖర్జీతో మౌసమి పెళ్లి జరిగింది.

15 ఏళ్లకే పెళ్లి చేసుకున్న ఆమె 17 ఏళ్లకే తల్లైంది. అత్తగారింటి ప్రోత్సాహంతో మళ్లీ సినిమాల్లోకి అడుగు పెట్టింది. 1972లో అనురాగ్ సినిమాతో హీరోయిన్ గా చేసింది. ఆ మూవీ కూడా సక్సెస్ అవడంతో ఆమె క్రేజ్ పెరిగింది. వరుస సినిమాలు చేస్తున్న టైం లో కూడా ఆమె క్యాస్టింగ్ కౌచ్ ను ఎదుర్కొంది. అడ్జెస్ట్ మెంట్ కు ఓకే అంటేనే సినిమా అవకాశాలు అనగానే ఇక వాటికెళ్లి చూడలేదు. తన వల్లే సినిమా అవకాశాలు రాలేదని మౌసమి చెప్పుకొచ్చింది. 2015లో వచ్చిన పీకూ లో నటించింది మౌసమి.

Tags:    

Similar News