అతన్ని గుడ్డిగా నమ్మేస్తానంటోన్న హీరోయిన్
అతనే అనురాగ్ బస్. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో `లూడో` చిత్రం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మంచి విజయం సాధించింది.
కొంత మంది దర్శకులంటే? హీరోలు..హీరోయిన్లకు బలమైన నమ్మకం. అది ఎంతలా అంటే బ్లైండ్ గా నమ్మేస్తుంటారు. గతంలో ఇచ్చిన సక్సెస్ లు కావచ్చు....ఇతర హీరోలతో అందుకున్న బ్లాక్ బస్టర్లు కావచ్చు. వీటినే ప్రామాణికంగా తీసుకుని కొంత మంది నటీనటులు కనీసం కథలు కూడా వినకుండా ఎస్ చెబుతుంటారు. తాజాగా బాలీవుడ్ నటి ఫాతిమా షేక్ సనా కి కూడా అలాంటి దర్శకుడు ఒకరున్నారని తెలిపింది.
అతనే అనురాగ్ బస్. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో `లూడో` చిత్రం రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఆ సినిమా మంచి విజయం సాధించింది. అంతకు ముదు ఆయన చేసిన చాలా సినిమాలు బాలావుడ్ లో మంచి విజయాలు అందుకున్నాయి. ప్రస్తుతం ఫాతిమా సనా షేక్ `మెట్రో ఇన్ డీనో` అనే సినిమాలో నటించడానికి రెడీ అవుతుంది. ఇది 2007 లో రిలీజ్ అయిన `లైఫ్ ఇన్ ఏ మెట్రో`కి సీక్వెల్ గా తెరకెక్కిస్తున్నారు.
ఇందులో షనా ది పది మందిలో ఒకరి పాత్ర. అయితే ఈ సినిమా లో తన పాత్ర కూడా వినకుండా ఒకే చెప్పిందిట. కేవలం అనురాగ్ డైరెక్ట్ చేస్తున్నారనే కారణంతో ఇంకే విషయం ఆలోచించకుండా సంతకం చేసిందిట. ఆయన కోసం ఎలాంటి పాత్రలోనైనా ఎలాగైనా నటిస్తాను అంటోంది. `ఆయన సినిమాలో ఒక సెకన్ పాత్ర లో నైనా నటిస్తాను. అనురాగ్ అంటే ఇష్టం..అభిమానం.
ఒక రోజు ఫోన్ చేసి మెట్రో కథ చెబుతున్నారు. అప్పుడు నా ఫోన్ సిగ్నెల్ సరిగ్గా లేదు. ఆయన ఏం చెబుతున్నారో? కూడా సరిగ్గా అర్దం కాలేదు. అయినా సరే ఆయనపై నమ్మకంతో ఎస్ చెప్పాను. ఆయన నీకు పాత్ర గురించి పూర్తిగా తెలుసా? నేను ఏం చెప్పానో? అర్దమైందా? అని కలిసిన తర్వాత అడిగారు. దానికి నేను నాకేం తెలియదు...మీరు ఉన్నారు? అనే నమ్మకంతో ఎస్ చెప్పాను అని బధులిచ్చాను. అప్పుడాయన ఓ చిన్న నవ్వుకుని వెళ్లిపోయారు ` అని అంది.