బులుగు ఫ్రాకులో ప్రగ్య మంటలు
అందం ఉంది .. ప్రతిభ ఉంది .. కొన్ని పెద్ద అవకాశాలు వచ్చాయి... కానీ ఎక్కడో తేడా కొట్టింది
అందం ఉంది .. ప్రతిభ ఉంది .. కొన్ని పెద్ద అవకాశాలు వచ్చాయి... కానీ ఎక్కడో తేడా కొట్టింది. కారణం ఏదైనా కానీ ప్రగ్య జైశ్వాల్ తాను ఆశించిన స్టార్ డమ్ ని దక్కించుకోలేకపోయింది. ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడం కోసం ఇంకా ఇంకా వేచి చూడాల్సిన పరిస్థితి. ఇటు సౌత్.. అటు నార్త్ రెండు చోట్లా ఇదే పరిస్థితి. పెద్ద స్టార్లు అవకాశాలు కల్పించినా కానీ తనకు విజయాలు కరువవ్వడం కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపుతోంది. అయినా ప్రగ్యా మాత్రం నిరాశ చెందక తనవంతు ప్రయత్నాలను ఆపడం లేదు.
ఇప్పటికీ తెలుగులో ప్రముఖ దర్శకనిర్మాతలకు ఈ భామ ఫీలర్స్ పంపుతూనే ఉంది. పలువురు అగ్ర హీరోల సరసన అవకాశం వచ్చినట్టే వచ్చి మిస్సయిందని ఇటీవల కథనాలొచ్చాయి. అయినా ఇవేవీ తనని ప్రభావితం చేయడం లేదు. ఎప్పటిలానే వరుస ఫోటోషూట్లను షేర్ చేస్తూ ప్రగ్య తన అభిమానులకు టచ్ లో ఉంది. తాజాగా ప్రగ్య షేర్ చేసిన ఓ హాట్ ఫోటోషూట్ ఇంటర్నెట్ ని షేక్ చేసింది.
అందమైన నీలిరంగు మినీ దుస్తులలో ప్రగ్య ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా కనిపిస్తోంది. స్లీవ్ లెస్ డిజైనర్ ఫ్రాకులో ప్రగ్య అందచందాలను వర్ణించడానికి గమ్మత్తయిన పదాల్ని వెతుక్కోవాలి. ప్రగ్య కొత్త లుక్ ఇప్పుడు అంతర్జాలంలో వైరల్ గా దూసుకెళుతోంది. ప్రగ్యా స్టైలింగ్ గురించి యువతరం ప్రత్యేకంగా తరచి చూస్తోంది. మునుపటి కంటే బోల్డ్ ఫ్యాషన్ ఎంపికతో అందరి దృష్టిని ఆకర్షించింది. చివరిగా ఇలాంటి సిన్సియర్ ప్రయత్నాలు ఫలించి ఏదైనా కొత్త సినిమాని ప్రకటిస్తుందేమో చూడాలి.