RC16 కోసం తంగాలన్ హ్యాండ్.. బుచ్చిబాబు ప్లాన్ సూపర్బ్

మూవీలో ప్రతినాయకుడి క్యారెక్టర్ కోసం ఎవరిని ఎంపిక చేస్తున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Update: 2024-09-19 05:24 GMT

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఫైనల్ గా ‘గేమ్ చేంజర్’ మూవీ షూటింగ్ గా కంప్లీట్ చేశాడు. ఇక ఇప్పుడు ‘RC16’ మూవీపైన ఫోకస్ చేశారు. ఈ సినిమాలో క్యారెక్టర్ కి తగ్గ మేకోవర్ కోసం రామ్ చరణ్ వెయిట్ చేస్తున్నారు. ఆ క్యారెక్టర్ తగ్గ లుక్, ఫిజిక్ ని సిద్ధం చేసుకునే పనిలో పడ్డారు. మరో వైపు దర్శకుడు బుచ్చిబాబు ‘RC16’ మూవీకి కావాల్సిన క్యాస్టింగ్ అండ్ క్రూని ఫైనల్ చేసుకుంటున్నారు. అలాగే లొకేషన్స్, సెట్ వర్క్ పైన ఫోకస్ చేశారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా ఇప్పటికే జాన్వీ కపూర్ ఖరారైపోయింది.

మూవీలో ప్రతినాయకుడి క్యారెక్టర్ కోసం ఎవరిని ఎంపిక చేస్తున్నారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. RC16 కి ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఆయన మూవీ కోసం ఇప్పటికే 3 సాంగ్ ట్యూన్స్ సిద్ధం చేశారనే ప్రచారం నడుస్తోంది. సినిమా కోసం అన్ని విభాగాలలో అనుభవజ్ఞులైన టెక్నీషియన్స్ ని బుచ్చిబాబు తీసుకుంటున్నారనే మాట ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఇప్పుడు RC16 కోసం కాస్ట్యూమ్ డిజైనర్ గా తంగలాన్ సినిమాకి వర్క్ చేసిన ఎగన్ ఏకాంబరంని బుచ్చిబాబు కన్ఫర్మ్ చేశారు.

ఈ విషయాన్ని ఎగన్ ఏకాంబరం ఇన్ స్టాగ్రామ్ లో కన్ఫర్మ్ చేశారు. తెలుగులో వర్క్ చేయడం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్న. ఆ అవకాశం RC16తో వచ్చింది. రామ్ చరణ్ తో కలిసి వర్క్ చేయబోతుండటం చాలా సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన బుచ్చిబాబుకి కృతజ్ఞతలు తెలుపుతున్నాను అంటూ ఎగన్ ఏకాంబరం ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టారు. తంగలాన్ సినిమా కోసం ఎగన్ ఏకాంబరం చేసిన వర్క్ స్క్రీన్ పై కనిపించింది. అందులో ప్రతి పాత్ర కోసం ఒకప్పటి వాతావరణం జీవనశైలికి సరిపోయే రీతిలో కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు.

తంగలాన్ సినిమాలో హీరో నుంచి ప్రతి ఒక్క యాక్టర్ వేసుకున్న కాస్ట్యూమ్స్ సినిమాకి రియలిస్టిక్ లుక్ తీసుకొచ్చాయి. ఈ మూవీకి విమర్శకుల ప్రశంసలు లభించాయి. ఇప్పుడు RC16 మూవీ కథని పీరియాడికల్ జోనర్ లో ఉత్తరాంధ్ర నేపథ్యంలో దర్శకుడు బుచ్చిబాబు చెప్పబోతున్నారు. ఉత్తరాంధ్ర అంటే ఏపీలో చాలా వెనుకబడిన ప్రాంతంగా ఉండేది. అక్కడి ప్రజల జీవనశైలి, వస్త్రధారణ కూడా చాలా సాధారణంగా ఉంటాయి.

ఆ రియలిస్టిక్ లుక్ కోసం ఇప్పుడు ఎగన్ ఏకాంబరం ని బుచ్చిబాబు తీసుకున్నట్లు తెలుస్తోంది. కచ్చితంగా ఉత్తరాంధ్ర గ్రామీణ వాతావరణాన్ని బుచ్చిబాబు పెర్ఫెక్ట్ గా ఎలివేట్ చేయాలనే లక్ష్యంతో ఉన్నాడని ఆయన టెక్నీషియన్స్ ఎంపిక చూస్తుంటే అర్ధమవుతోంది. అలాగే ఈ సినిమాలో రియలిస్టిక్ ఫీల్ కోసం ఉత్తరాంధ్ర నేపథ్యం ఉన్న యాక్టర్స్ ని ఇప్పటికే ఎంపిక చేశారు.

Tags:    

Similar News