టెన్నిస్ డ్రెస్సులో ఐషా పాప.. హై గ్లామర్ డోస్
ఇక నేహా శర్మ చెల్లెలు ఐషా శర్మ కూడా అక్క దారిలోనే నటిగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.
చిరుత సినిమాలో నటించిన నేహా శర్మని ఎవ్వరు అంత ఈజీగా మర్చిపోరు. మొదటి సినిమాతోనే నేహా శర్మ అటు గ్లామర్, ఇటు నటనతో మెప్పించింది. తరువాత నేహా శర్మకి తెలుగులో ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. బాలీవుడ్ లోకి అడుగుపెట్టి అక్కడ అడపాదడపా సినిమాలు, వెబ్ సిరీస్ లు చేస్తోంది. ఇక నేహా శర్మ చెల్లెలు ఐషా శర్మ కూడా అక్క దారిలోనే నటిగా బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది.
మోడల్ గా కెరియర్ స్టార్ట్ చేసిన ఐషా శర్మ తరువాత 2018లో జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కిన సత్యమేవ జయతే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఆ మూవీతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే తరువాత ఐషా శర్మకి పెద్దగా అవకాశాలు రాలేదు. 2022లో షైనింగ్ విత్ సర్మాస్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించింది. అలాగే ఇప్పటి వరకు మూడు మ్యూజిక్ వీడియోస్ లలో కూడా ఈమె సందడి చేసింది.
హీరోయిన్ గా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోయిన ఐషా శర్మ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటోంది. ఇన్ స్టాగ్రామ్ లో రెగ్యులర్ గా ఫోటోలని, అప్డేట్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది. ఈ బ్యూటీకి ఇన్ స్టాగ్రామ్ లో 6.8 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే ఎలాంటి ఫోటోలని షేర్ చేసిన లక్షల్లో లైక్స్ వస్తూ ఉంటాయి. అక్క నేహా శర్మ ఇన్ ఫ్ల్యూయెన్స్ ఐషా శర్మ మీద ఎక్కువగానే ఉన్నట్లు కనిపిస్తూ ఉంటుంది.
ఎప్పటికప్పుడు గ్లామర్ పిక్స్ ని ఇన్ స్టాగ్రామ్ లో ఈ బ్యూటీ షేర్ చేస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా టెన్నిస్ కోర్టులో టెన్నిస్ స్పోర్ట్స్ స్టార్స్ వేసే స్కర్ట్, జాకెట్ తో ఐషా శర్మ ఫోటోలకి ఫోజులిచ్చింది. ఈ ఫొటోస్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఈ కాస్ట్యూమ్స్ తో ఐషా శర్మ అచ్చం టెన్నిస్ స్పోర్ట్స్ గర్ల్ లా ఉందనే కామెంట్స్ నెటిజన్లు నుంచి వినిపిస్తున్నాయి.