నేను ఫ్యామిలీ టైపు సినిమాలే చేస్తా!
ప్రస్తుతం తమిళ్ .కన్నడ..మలయాళ భాషల్లోనే ఎక్కువ సినిమాలు చేస్తోంది.
ఐశ్వర్యా రాజేష్ గురించి పరిచయం అవసరం లేదు. `కౌసల్య కృష్ణ మూర్తి`తో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అమ్మడు తొలి సినిమాతోనే నటనలో తనదైన మార్క్ వేసింది. విమర్శలకు ప్రశంసలు దక్కించుకుంది. కానీ అమ్మడి కెరీర్ ఇక్కడ ఆశించిన విధంగా సాగలేదు. కోలీవుడ్ లో బిజీ హీరోయిన్ అయినా ? ఆమె ఛరిష్మా ఇక్కడ వర్కౌట్ అవ్వలేదు. అయినా ఐశ్వర్య రాజేష్ టాలీవుడ్ ని లైట్ తీసుకోలేదు. ఆడ ఉంటా..ఈడా ఉంటానంటూ కెరీర్ ని ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతుంది. వచ్చిన అవకాశాల్ని వినియోగించుకుంటోంది.
ప్రస్తుతం తమిళ్ .కన్నడ..మలయాళ భాషల్లోనే ఎక్కువ సినిమాలు చేస్తోంది. ఈ అమ్మడు కూడా ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించి సక్సెస్ అయిన నటి. అయితే అమ్మడు తొలి నుంచి గ్లామర్ పాత్రలకు దూరంగానే ఉంది. సంప్రదాయ పద్దతైన పాత్రలు పోషిస్తూనే నటిగా కొనసాగుతుంది. ఇప్పటికీ అదే రూల్ తో ముందుకు సాగుతుంది. మార్కెట్ లో ఎంత కాంపిటీషన్ ఉన్నా తన పంథా మార్చుకోనంటూ ముందుకు సాగుతోంది.
తాజాగా గ్లామర్ రోల్స్ గురించి మరోసారి స్పందించింది. గ్లామర్ గా నటించమని చాలా మంది చాలా అవకాశాలిచ్చారు. కానీ అలాంటి ఛాన్సులు వద్దని తిరిగి పంపించిన సందార్భాలెన్నో ఉన్నాయి. నా మనసుకు నచ్చిన పాత్రలు, తగిత పాత్రలు వస్తేనే చేస్తాను. లేదంటే ఇంట్లో ఖాళీగా కూర్చుంటాను. అంతేగానీ గ్లామర్ గా నటించడం అంటే నావల్ల కాని పని. అలా నటించడం నాకెంతో అసౌకర్యంగా అనిపిస్తుంది. ముఖ్యంగా ఫ్యామిలీ తరహా సినిమాలు మాత్రమే చేయాలనుకుంటున్నా.
అందులో నా పాత్రకు వెయింట్ ఉండేలా చూసుకుంటా. ప్రస్తుతం నా వయసు 34. భవిష్యత్ లో నా వయసు పెరుగుతుందే తప్ప తరగదు. దానికి విలువనిచ్చి ముందుకు సాగాలి అన్నది మాత్రమే నా ఆలోచన. ఆ రూల్ దాటి కొత్తగా గ్లామర్ పాత్రలు పోషించినా నేను సాధించేది ఏమీ ఉండదు` అని అంది.