అఖిల్ ఈసారి టార్గెట్ మిస్ అవ్వదంతే..!
అఖిల్ తో ధీర అంటూ ఒక పీరియాడికల్ మూవీ ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ సినిమా రాజులకాలం నాటి కథతో వస్తుందని అంటున్నారు.
అఖిల్ ఏజెంట్ వచ్చి ఏడాది అవుతున్నా నెక్స్ట్ సినిమాపై ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. అఖిల్ తో యువి ప్రొడక్షన్స్ ఒక భారీ సినిమా ప్లానింగ్ లో ఉన్నారని వార్తలు వస్తున్నాయి కానీ వాటిల్లో ఎంతవరకు వాస్తవం ఉంది అన్నది తెలియట్లేదు. అయితే ఆ సినిమా కోసమే అన్నట్టుగా అఖిల్ తన లుక్ మార్చేశాడు. పొడవాటి జుట్టు గుబురు గడ్డంతో యోధుడి లుక్ తో అఖిల్ అదుర్స్ అనిపించాడు.
సినిమా ఏంటో డిసైడ్ అయ్యాక అనౌన్స్ చేయడానికి ఎందుకు లేట్ చేస్తున్నారు అన్నది తెలియట్లేదు. అఖిల్ తో ధీర అంటూ ఒక పీరియాడికల్ మూవీ ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ సినిమా రాజులకాలం నాటి కథతో వస్తుందని అంటున్నారు. ఇంచుమించి చిన్నపాటి బాహుబలి రేంజ్ లో సినిమా ఉండబోతుందని చెప్పుకుంటున్నారు.
ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా విషయంలో అఖిల్ చాలా ఫోకస్ తో ఉన్నాడని తెలుస్తుంది. సినిమా ప్రకటించిన నాటి నుంచి రిలీజ్ అయ్యే వరకు సినిమా ఎక్కడ టార్గెట్ మిస్ అవ్వకూడదని పర్ఫెక్ట్ స్కెచ్ వేశారని తెలుస్తుంది. అఖిల్ నెక్స్ట్ సినిమా కోసం అక్కినేని ఫ్యాన్స్ కూడా ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తుంటే వారి వెయిట్ టైం ఇంకాస్త పెంచుతూ వస్తున్నాడు అఖిల్.
కెరీర్ లో ఒక బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎంతో ఆసక్తిగా ఉన్న అఖిల్ ధీర సినిమాతో అది సాధ్యం చేస్తాడని అంటున్నారు. యువి క్రియేషన్స్ తో పాటుగా హోంబలె బ్యానర్ కూడా అఖిల్ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతున్నారని తెలుస్తుంది. ప్రతి సినిమాకు తన బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్న అఖిల్ ధీరాతో బాక్సాఫీస్ దగ్గర దమ్ము చూపిస్తాడా లేదా అన్నది చూడాలి. అఖిల్ 7వ సినిమానే కాదు ఆ తర్వాత సినిమా కథా చర్చలు కూడా జరుగుతున్నట్టు తెలుస్తుంది.
ఓ పక్క కింగ్ నాగార్జున తన కెరీర్ పక్కన పెట్టి అఖిల్ కోసం సూపర్ హిట్ కథల వేటలో పడినట్టు చెబుతున్నారు. నట వారసుడు ఎంట్రీ ఇచ్చిన్ పదేళ్లు అవుతున్నా ఒక్క సూపర్ హిట్ లేకపోవడం కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది. అందుకే అఖిల్ కోసం సూపర్ హిట్ స్టోరీస్ వేటలో నాగార్జున కూడా ఉన్నాడని తెలుస్తుంది. అఖిల్ హిట్ పడేవరకు ఫ్యాన్స్ లో కూడా ఈ టెన్షన్ కొనసాగుతూనే ఉంటుంది.