'సలార్'పై రక్కసుల అక్కసు
ఇవన్నీ బాలీవుడ్ కి చెందిన ప్రముఖ జర్నలిస్టుల వెబ్ సైట్లు అన్న సంగతి కూడా ప్రజలకు తెలుసు.
సలార్ వర్సెస్ డంకీ క్లాష్ ఎప్పటికీ చర్చనీయాంశమైనది. నిజానికి ప్రభాస్ నటించిన సలార్ విడుదలైన కేవలం 7 రోజుల్లో 500 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టింది. అంటే యావరేజ్ లెక్కలు చూస్తే రోజుకు 80కోట్లు చొప్పున వసూలైనట్టే. తొలిరోజు ఏకంగా 175 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది సలార్. అదే సమయంలో షారూఖ్ నటించిన డంకీ కేవలం 30 కోట్ల ఓపెనింగులతో చాలా వెనకబడింది. కానీ డంకీకి హిందీ మీడియా ప్రచారం ఊదరగొట్టేసింది. ``జన్మలో ఇలాంటి సినిమా మళ్లీ చూడలేరు. షారూఖ్ కెరీర్ లో మరో క్లాసిక్ సినిమా`` అంటూ ప్రచారం సాగించాయి చాలా వెబ్ పోర్టళ్లు. ఇవన్నీ బాలీవుడ్ కి చెందిన ప్రముఖ జర్నలిస్టుల వెబ్ సైట్లు అన్న సంగతి కూడా ప్రజలకు తెలుసు.
థియేటర్ల కోసం సలార్ - డంకీ నిర్మాతలు పోటీపడుతున్నప్పుడే ఒక సెక్షన్ సలార్ పై ఉక్కు పాదం మోపేందుకు కుట్ర పన్నిన సంగతి అర్థమైంది. పీవీఆర్ ఐనాక్స్ ఉత్తరాదిన సలార్ కంటే డంకీకి అధిక ప్రాధాన్యతనివ్వడం, దానిపై సలార్ నిర్మాతలు సీరియస్ అవ్వడం అటుపై మారిన పరిణామాలతో తిరిగి పీవీఆర్ వాళ్లు వెనక్కి తగ్గి సలార్ కి థియేటర్లు ఇవ్వడం వగైరా వ్యవహారాలు తెలిసినదే. కారణం ఏదైనా చివరి నిమిషం వరకూ ఉత్తరాదిన చాలా చోట్ల సలార్ ఆన్ లైన్ టికెటింగ్ లేని పరిస్థితి. దీని ఇంపాక్ట్ అంతో ఇంతో సలార్ ఓపెనింగులపైనా పడింది.
ఇదో రకం కుట్ర అనుకుంటే చాలా చోట్ల సింగిల్ థియేటర్ ఓనర్లు కూడా సలార్ కి స్కోప్ లేకుండా చేయడం, దాంతో పాటే రివ్యూవర్లు సలార్ ని తక్కువ చేసి రాయడం వగైరా అంశాలు నిజానికి ప్రభాస్ సినిమాకి చాలా మైనస్ అయ్యాయి. దీనిపై జెంటిల్మన్ లు ప్రభాస్, ప్రశాంత్ నీల్ అంతగా స్పందించకపోయినా ఇన్ సైడ్ బోలెడంత చర్చ జరిగిందన్నది నిర్వివాదాంశం. ఒక గూడుపుటానీ బ్యాచ్ సోషల్ మీడియాల్లో సలార్ పై పెద్ద కుట్ర చేసిన వైనం కూడా బయటపడింది. సలార్ చిత్రాన్ని తొందర్లోనే ఓటీటీలో రిలీజ్ చేసేస్తారని కూడా వీరంతా ప్రచారం సాగించారు. ఇది యావరేజ్ సినిమా అని కేజీఎఫ్ ఛాయల్లో ఉందని కూడా కొందరు మీడియాల్లో రాసారు. మౌత్ టాక్ స్ప్రెడ్ చేసారు. అయితే ఎవరు ఎన్ని చేసినా కానీ కంటెంట్ ఏల్తుందని మరోసారి సలార్ నిరూపించింది. ప్రశాంత్ నీల్ డార్క్ మోడ్ మేకింగ్ ప్రజలకు నచ్చిందని 500 కోట్ల వసూళ్లు చెబుతున్నాయి.
సలార్ 7 రోజులకు 500 కోట్లు వసూలు చేసి, ఇప్పుడు ఈ ఆదివారం సెలవును, జనవరి 1 సెలవును, అలాగే సంక్రాంతి ముందు సెలవులను క్యాష్ చేసుకునేందుకు వడి వడిగా అడుగులు వేస్తోంది. కానీ ఇప్పటికే సలార్ వసూళ్లు దారుణంగా పడిపోయాయి అంటూ ఉత్తరాదిన ఒక సెక్షన్ డిజిటల్ మీడియాలు ప్రచారం చేయడం ఆశ్చర్యపరుస్తోంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో వీకెండ్లు సలార్ థియేటర్లు కిటకిటలాడుతున్నాయి. మిగతా రోజుల్లో ఆక్యుపెన్సీ తక్కువగా ఉన్నా కానీ తీసికట్టుగా లేవు. ఇక ఇదే జోరును కొనసాగిస్తే సలార్ కూడా 800కోట్ల వరకూ సులువుగా సాధించే అవకాశం లేకపోలేదని చెబుతున్నారు. రణబీర్ కపూర్ యానిమల్ 850కోట్లు వసూలు చేసింది. కనీసం దానికి చేరువగా అయినా సలార్ వెళుతుందని అభిమానులు భావిస్తున్నారు. తప్పుడు ప్రచారం స్ప్రెడ్ అవ్వకుండా నిలువరించేలా, సలార్ పై పాజిటివ్ బజ్ పెంచేందుకు చిత్రబృందం ఏదైనా చేస్తుందేమో చూడాలి.