పుష్ప రాజ్ వైల్డ్ ఫైర్.. బడా స్టార్స్ ఫిదా

ఇక రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్ తో సినిమా బాక్సాఫీస్ వద్ద అసలు ఆటను మొదలుపెట్టింది. ఇప్పటివరకు ఎవరు అందుకోని రికార్డులను సైతం అల్లు అర్జున్ సింగిల్ హ్యాండ్ తో బ్రేక్ చేశాడు.

Update: 2024-12-17 11:06 GMT

పుష్ప 2 క్రేజ్ ఇప్పుడు ఏ స్థాయిలో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పునవసరం లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ బిగ్ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా విడుదలకు ముందు నుంచే అన్ని భాషలలో కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేసింది. ఇక రిలీజ్ తర్వాత పాజిటివ్ టాక్ తో సినిమా బాక్సాఫీస్ వద్ద అసలు ఆటను మొదలుపెట్టింది. ఇప్పటివరకు ఎవరు అందుకోని రికార్డులను సైతం అల్లు అర్జున్ సింగిల్ హ్యాండ్ తో బ్రేక్ చేశాడు.

అసలు సినిమా ఈ స్థాయిలో రికార్డులు క్రియేట్ చేస్తుంది అని ఎవరు ఊహించలేదు. వీకెండ్స్ మాత్రమే కాకుండా వర్కింగ్ డేస్ లో కూడా ఈ సినిమా మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఇక సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా జనాలను ఎంతగానో అట్రాక్ట్ చేస్తోంది. సినిమా వచ్చి రెండు వారాలు గడిచిన కూడా ఇంకా నార్త్ సెట్స్ లలో హౌస్ ఫుల్ బోర్డులు దర్శనమిస్తున్నాయి అంటే క్రేజ్ ఏ స్థాయిలో పెరిగిపోయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఇప్పటికే అత్యధిక వేకంగా 1000 కోట్లు అందుకున్న ఇండియన్ సినిమాగా పుష్ప 2 సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇక నార్త్ లో అయితే ఇప్పటికే 600 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక ఈ సంఖ్య ఇంకా ఎక్కడి వరకు వెళ్తుందో ఊహించడం కూడా కష్టంగానే ఉంది అని ట్రేడ్ వర్గాలు చెబుతూ ఉన్నాయి.

ఎందుకంటే మొదటివారం మాత్రమే కాకుండా రెండో వారం కూడా సినిమా అదే తరహాలో కలెక్షన్స్ అద్దుకుంటూ వెళ్లింది. ఇక పుష్పరాజ్ హవా చూసిన తర్వాత బాలీవుడ్ సినీ ప్రముఖులు సైతం చాలా పాజిటివ్ గా స్పందిస్తున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సైతం పుష్పరాజ్ డైలాగ్ చెప్పి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు అంటే అల్లు అర్జున్ మేనియా ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో అర్థం చేసుకోవచ్చు.

ఒక ప్రైవేట్ కమర్షియల్ ప్రమోషన్స్ కోసం ప్రెస్ మీట్ లో పాల్గొన్న అక్షయ్ కుమార్ అక్కడ వైల్డ్ ఫైర్ అంటూ పుష్ప రాజ్ శైలిలో డైలాగ్ చెప్పి అందరిని ఆకట్టుకున్నారు. ఇక సోషల్ మీడియాలో అందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. ఇప్పటికే బాలీవుడ్ బడా స్టార్స్ రికార్డులను బ్రేక్ చేసిన అల్లు అర్జున్ ఇప్పుడు వారి చేత డైలాగ్స్ కూడా చెప్పిస్తూ ఉండడం విశేషం అని ఫ్యాన్స్ అందరూ కూడా పాజిటివ్ గా స్పందిస్తూ ఉన్నారు.

Tags:    

Similar News