ఇటాలీయన్ రీమేక్ అతడి రాతను మారుస్తుందా?
ఈ ఐదేళ్ల కాలంలో కిలాడీ అక్షయ్ కుమార్ పూర్తిగా బ్యాడ్ పేజ్ లో కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.
ఈ ఐదేళ్ల కాలంలో కిలాడీ అక్షయ్ కుమార్ పూర్తిగా బ్యాడ్ పేజ్ లో కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. వరుసగా 16 వైఫల్యాలతో తీవ్ర విమర్శలు మూటగట్టుకున్నాడు. కెరీర్ లో ఏనాడు ఎదురవ్వని ఓటమి తొలిసారి ఎదురైంది. ఇన్ని పరాజయాలు ఇంతవరకూ ఏ హీరో కూడా ఎదుర్కోలేదు. ఆ రకంగా కిలాడీ కెరీర్ లో ఇదో చెత్త రికార్డుగా నమోదైంది. దీంతో అక్షయ్ విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కోవడం వాటి గురించి ఆయన బాధపడటం, వాటిని దాటుకుని ఎలా ముందుకెళ్తున్నాడు? అన్నది కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది.
ఇదంతా ఇప్పటి జర్నీ. ఒక్కసారి 2016-19 మధ్యలో చూస్తే కిలాడీ స్పీడ్ మూములుగా లేదు. కోవిడ్ పాండమిక్ లో సైతం రికార్డు వసూళ్లు రాబట్టిన చరిత్ర సైతం అతడికే సొంతం అన్నది వాస్తవం. వరుస విజయాలతో హిట్ మెషిన్ గా ఖ్యాతికెక్కాడు. హిట్‌లు - సూపర్ హిట్‌లతో అతడి పేరు ఓ రేంజ్లో మారు మ్రోగింది. ఆ విజయాలు చూసే నిర్మాతంతా క్యూ కట్టి మరీ సినిమాలు చేసారు. 2019లోనే నాలుగు సూపర్ హిట్‌లను అందించాడు.
`కేసరి`, `హౌస్‌ఫుల్ 4`, `మిషన్ మంగళ్` , `గుడ్ న్యూజ్` ఇలా ఒక్కొక్కటి 200 కోట్ల వసూళ్లు సాధించిన చిత్రాలే. అప్పుడు హీరోలంతా బాక్సాఫీస్ వద్ద చతికిల పడుతోన్న సమయంలో కిలాడీ మాత్రమే బాలీవుడ్ కి ఊపిరిపోసాడు అన్నది ఒప్పుకోవాల్సిన వాస్తవం. నేడు విమర్శలు గుప్పిస్తున్న వారంతా నాటి రోజుల్ని తప్పక స్మరించుకోవాల్సి ఉంది. తాజాగా ఆగస్టు 15న `ఖేల్ ఖేల్ మే` తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.
అక్షయ్ వరుస వైఫల్యాల నేపథ్యంలో ఆ ప్రభావం సినిమాపై ఉంటుందన్నది వాస్తవం. కానీ `ఖేల్ ఖేల్ మే` అన్నది ఇటాలియన్ రీమేక్ చిత్రం. `పర్పెక్ట్ స్ట్రేంజర్స్` టైటిల్ తో రిలీజ్ అయిన సినిమా అక్కడ మంచి విజయం సాధించింది. కామెడీ-డ్రామా అక్కడ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయింది. ఇప్పటికే స్పెయిన్, టర్కీ, జర్మనీ, జపాన్, రష్యా, సహా 20 దేశాల్లో సైతం రీమేక్ అయింది. 2018లో కన్నడలో `లౌడ్ స్పీకర్` టైటిల్ తో జీతూ జోసేఫ్ రీమేక్ చేసారు.
మోహన్ లాల్ హీరోగా `అనుసరణను 12వ మనిషి` పేరుతో ఓటీటీలో రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. ఈ నేపథ్యంలో అక్షయ్ బ్యాడ్ ఫేజ్ లో ఉన్నా? ఇతర భాషల సక్సెస్ లన్నీ అతడకి పాజిటివ్ గానే కనిపిస్తున్నాయి. మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం సాధిస్తుందన్నది చూడాలి.