బ్యూటీ పొట్టలో పిడి గుద్దులు.. ఇదెక్కడి ఫిట్నెస్ రా బాబు..!

కానీ, అలాయా మాత్రం దానిని ఫిట్నెస్ లో భాగంగా ఎంజాయ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

Update: 2023-08-21 10:30 GMT

ఒకప్పుడు హీరోయిన్లు అంటే కేవలం, హీరోతో డ్యాన్సులు వేయడానికి, రొమాన్స్ చేయడానికి మాత్రమే ఎంపిక చేసుకునేవారు. కానీ , ఇప్పుడు మొత్తం మారిపోయింది. హీరోయిన్లు కూడా హీరోలతో సమానంగా ఫైట్లు చేస్తున్నారు. కేవలం యాక్షన్ సీన్ల కోసం అనే మాత్రమే కాదు, వారు కూడా ఫిట్నెస్ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉండాలని అనుకుంటున్నారు. అందుకే, తమ శరీరానికి మించిన వ్యాయామాలు చేస్తూ ఉంటారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ అలాయా మాత్రం తన ఫిట్నెస్ విషయంలో విపరీతంగా భయపెట్టేస్తోంది.

తన బక్క పలచని బాడీ మీద పిడిగుద్దులు కొట్టించుకుంది. వీడియో చూస్తుంటేనే భయం వేస్తోంది. కానీ, అలాయా మాత్రం దానిని ఫిట్నెస్ లో భాగంగా ఎంజాయ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఇదెక్కడి ఫిట్నెస్ వీడియో రా బాబు అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, అలాయా జవానీ జానేమన్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెట్టింది. మొదటి సినిమాలోనే ఆమె అందానికి అందరూ ఫిదా అయిపోయారు.

ఆ తర్వాత ఆమెకు మరో, రెండు మూడు సినిమాల్లో ఛాన్సులు వచ్చాయి. కార్తీక్ ఆర్యన్ తో కలిసి ఫ్రెడ్డీ మూవీలో నటించింది. ఈ మూవీలో గ్లామర్ కూడా ఒలకబోసింది. లిప్ లాక్ సీన్లతో హీటు కూడా పెంచింది. నెగిటివ్ షేడ్ లో కనిపించింది. కానీ ఈ మూవీ పెద్దగా క్లిక్ కాలేకపోయింది. థియేటర్ కంటే, ఓటీటీలో ఈ మూవీని ప్రేక్షకులు ఆదరించారు. కాగా, ఈ బ్యూటీ సోషల్ మీడియాలోనూ చాలా చురుకుగా ఉంటుంది.

ఇక అలాయా పూర్తి పేరు అలాయా ఇబ్రహీం ఫర్నీచర్ వాలా. ఒకప్పటి అందాల తార పూజా బేడీ కుమార్తె ఈ అలాయా. కబీర్ బేడీకి మనవరాలు. ముంబయిలోని జమ్నాబాయి నర్సీ స్కూల్ లో చదువుకుంది. సినిమాల్లో ఎంట్రీ ఇవ్వక ముందే న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో యాక్టింగ్ మొదలుపెట్టింది. ఆ తర్వాతే తన పేరును అలాయా ఎఫ్ గా మార్చుకుంది.

కాగా, ఈమె తన మొదటి సినిమాలోనే గర్భిణీ గా నటించి అందరికీ షాకిచ్చింది, ఇక ఫ్రెడ్డీ మూవీలో సైతం హీరోని మోసం చేసే పాత్రలో నటించింది. గ్లామర్ గా కనిపిస్తూనే, నటకు ప్రాధాన్యత ఉన్న పాత్రలను ఎంచుకుంటూ ముందుకు దూసుకుపోతోంది. మొదటి సినిమాలోనే తన నటనకు ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకోవడం విశేషం.

Tags:    

Similar News