పిక్ టాక్ : ఇంత అందమైన జంటను చూసి ఉండరు

బాలీవుడ్ మోస్ట్‌ బ్యూటీ ఫుల్‌ కపుల్‌ గా రణబీర్ కపూర్, ఆలియా భట్ ల జోడీ నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు

Update: 2024-03-03 07:53 GMT
పిక్ టాక్ : ఇంత అందమైన జంటను చూసి ఉండరు
  • whatsapp icon

బాలీవుడ్ మోస్ట్‌ బ్యూటీ ఫుల్‌ కపుల్‌ గా రణబీర్ కపూర్, ఆలియా భట్ ల జోడీ నిలుస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇద్దరూ బాలీవుడ్ లో మోస్ట్‌ వాంటెడ్ స్టార్స్. ఇద్దరికి కూడా ఇంకా ఎంతో సినీ ఫ్యూచర్ ఉంది. ఇద్దరికి కూడా సపరేట్ గా ఫ్యాన్‌ ఫాలోయింగ్ దేశ వ్యాప్తంగా ఉంది.

అలాంటి ఆలియా భట్ మరియు రణబీర్ కపూర్ లు ఇలా ఫోటోలకు ఫోజ్ ఇచ్చి సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేస్తే ఏమైనా ఉందా... అభిమానులతో పాటు అంతా కూడా పిచ్చెక్కి పోవడం ఖాయం. వీరిద్దరు కలిసి నటిస్తేనే సినీ ప్రేక్షకులు ఆహా ... ఓహో అంటూ ఉంటారు. అలాంటిది ఇలా సరదాగా పర్సనల్ పిక్స్ షేర్‌ చేస్తే ఫ్యాన్స్ కి పండుగే.

ఇటీవల ఒక ప్రైవేట్‌ కార్యక్రమంలో భాగంగా రణబీర్ కపూర్ మరియు ఆలియా భట్ లు ఫోటోలకు ఫోజ్ ఇచ్చారు. ఈ ఫోటోలు షేర్ చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలోనే లక్షల లైక్స్ మరియు షేర్స్ దక్కించుకున్నాయి అంటే ఏ స్థాయిలో ఈ ఫోటోలు నెటిజన్స్‌ ను ఆకట్టుకుంటున్నాయో అర్థం చేసుకోవచ్చు.

ఆ మధ్య ఆలియా మరియు రణబీర్ కపూర్ ల మధ్య విభేదాలు అంటూ కొన్ని సోషల్ మీడియా పుకార్లు షికార్లు చేశాయి. వాటికి ఈ ఫోటోతో ఫుల్‌ క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇకపై అలాంటి పుకార్లు రాకుండా కూడా ఈ ఫోటో గట్టి సమాధానం గా నిలుస్తుంది. ఇక వీరి సినిమాల విషయానికి వస్తే కెరీర్‌ లోనే అత్యంత బిజీగా ప్రస్తుతం వీరు సినిమాలు చేస్తున్నారు.

Tags:    

Similar News