భర్తని టోన్ తోనే కంట్రోల్ చేస్తోందా?
చిన్న వయసు నుంచి నాన్న గొంతు అంటే ఎంతో భయమన్నాడు.
చిన్న వయసులో పిల్లలకు తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరి భయం ఉంటుంది. పిల్లలు తప్పులు చేయకుండా దండించే అవసరం ఎంతైనా తల్లిదండ్రులపై ఉంటుంది. కాబట్టి తప్పు..ఒప్పు తెలిసే వరకూ దండన అనేది తప్పదు. అలా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ కి తన తండ్రి అంటే ఎంతో భయమట. ముఖ్యంగా తండ్రి రిషీకపూర్ గొంతు ఎత్తితే చాలు చెమటలు పట్టేసేవట. చిన్న వయసు నుంచి నాన్న గొంతు అంటే ఎంతో భయమన్నాడు.
అమ్మతో ఎలాంటి ఇబ్బంది లేకపోయినా డాడ్ తో మాత్రం స్కూల్ కి వెళ్లే రోజుల్లో గొంతుకి భయపడిన సందర్భా లెన్నో ఉన్నాయన్నాడు. ఇప్పటికీ తండ్రి తమ మధ్య లేకపోయినా ఆ గొంతు అంటే ఎంతో భయమన్నాడు. అయితే ఇప్పుడు ఆయన స్థానంలో భార్య అలియాభట్ ఉందన్న విషయాన్ని చెప్పకనే చెప్పాడు. అలియాభట్ గొంతు ఎత్తి మాట్లాడినా అంతే భయపడతాడుట. అయితే అది చాలా రేర్ గా జరుగుతుందని...డాడ్ అంత ప్రభావం లేదన్నాడు.
అయితే తన కోసం అలియా బిగ్గరగా మాట్లాడే అలవాటు మానుకోవాలనుకుందిట. కుమార్తె రాహా కింద పడగానే వెంటనే గొంతెత్తి రియాక్ట్ అయిపోతుందట. కానీ రణబీర్ కపూర్ మనసు మాత్రం బాధపడుకుండానే వ్యవహి రిస్తుందిట. వీలైనంత వరకూ తనని ప్రశాంతంగా ఉంచడానికే ప్రయత్నిస్తుందిట. రణబీర్ కూడా భార్య విషయంలో అలాగే ఉండాలని ఏమీ అనడుట.
అలాగే అలియాభట్ తన జీవితంలో ఎంతో స్పెషల్ అన్నాడు. తనపై గౌరవంతో ఉంటుందిట. వీలైనంత వరకూ తనకి నవ్వుతూనే కనిపిస్తుందిట. మనసులో చెప్పుకోలేని బాధని సైతం దిగమింగుకుంటుందని...ఆ విషయంలో తనని చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అన్నాడు. మొత్తానికి అలియా-రణబీర్ ధాంపత్య జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నారు అన్నది అర్దమవుతుంది. ఇద్దరి జీవితాల్లో కుమార్తె కూడా తోడవ్వడంతో మరింత సంతోషం నిండింది.