బన్నీ మరో తమిళ్ కాంబో.. సెట్టయ్యిందా లేదా?

అలాగే, నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డును సైతం ఖాతాలో వేసుకున్నాడు.

Update: 2024-10-26 12:58 GMT

బడా ప్రొడ్యూసర్ వారసుడిగా సినిమాల్లోకి వచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, ఫైట్స్ ఇలా అన్నింటిలోనూ రాణిస్తూ తెలుగు సినీ ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఈ మధ్య కాలంలో ఫుల్ ఫామ్‌తో దూసుకుపోతోన్న అతడు.. ‘పుష్ప ది రైజ్’ చిత్రంతో పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయాడు. అలాగే, నేషనల్ బెస్ట్ యాక్టర్ అవార్డును సైతం ఖాతాలో వేసుకున్నాడు.


అల్లు అర్జున్ ప్రస్తుతం ‘పుష్ప’ మూవీకి సీక్వెల్‌గా రాబోతున్న ‘పుష్ప ది రూల్’లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన చాలా వరకూ షూటింగ్ కూడా పూర్తైంది. దీన్ని మొదటి భాగం కంటే హై రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసుకుని డిసెంబర్ 5వ తేదీన విడుదల చేయాలని చిత్ర యూనిట్ డిసైడ్ అయిపోయింది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పటికే సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నట్లు ప్రకటించాడు. బాలీవుడ్ నిర్మాణ సంస్థ టి సిరీస్‌ ఈ చిత్రాన్ని నిర్మించబోతుంది. అలాగే, ఈ చిత్రానికి ‘భద్రకాళీ’ అనే టైటిల్ పెడుతున్నట్లు ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ సినిమా షూటింగ్ మాత్రం ఇప్పట్లో ప్రారంభం అయ్యే అవకాశం లేదన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సుదీర్ఘమైన తన సినీ ప్రయాణంలో అల్లు అర్జున్ ఇద్దరు దర్శకులతోనే ఎక్కువ సినిమాలు చేశాడు. అందులో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒకరు. ఆయనతో ఈ స్టార్ హీరో గతంలో‘జులాయి’, ‘సన్నాఫ్ సత్యమూర్తి’, ‘అల.. వైకుంఠపురములో’ వంటి మూవీలు చేశాడు. ఈ మూడు సక్సెస్‌ల తర్వాత వీళ్లిద్దరూ మరో మూవీ చేస్తున్నారు. దీన్ని మరికొన్ని నెలల్లోనే ప్రారంభించబోతున్నారు.

ఇప్పటికే ఎన్నో ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. త్వరలోనే సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీతో మూవీ చేస్తున్నాడని చాలా కాలంగానే ప్రచారం జరుగుతోంది. కానీ, దీనిపై అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటి వరకూ రాలేదు. ఈ పరిస్థితుల్లోనే బన్నీ త్వరలోనే మరో తమిళ దర్శకుడు నెల్సన్‌ దిలీప్ కుమార్‌తో సినిమా చేస్తున్నట్లు తాజాగా న్యూస్ బయటకు వచ్చింది.

‘జైలర్’తో సెన్సేషనల్ హిట్‌ను అందుకున్న నెల్సన్ దిలీప్ కుమార్.. అల్లు అర్జున్ కోసం ఓ లైన్ రెడీ చేసి వినిపించాడట. దానికి ఇంప్రెస్ అయిన అతడు.. బౌండెడ్ స్క్రిప్టుతో రమ్మని చెప్పినట్లు తెలిసింది. అయితే, నెల్సన్ మాత్రం ‘జైలర్ 2’ కంప్లీట్ అయిన తర్వాతనే బన్నీతో సినిమా చేస్తాడని తెలిసింది. అది కూడా స్క్రిప్ట్ మొత్తం సిద్ధమైన తరువాతే బన్నీ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చే అవకాశం ఉంది. మరి నెల్సన్ పూర్తి స్క్రిప్ట్ తో మెప్పిస్తాడో లేదో చూడాలి.

Tags:    

Similar News