ప్రసవమే జరగలేదు.. ట్విన్స్ అంటారేంటి?
అయితే ఈ బ్యూటీ ఇటీవల కవలలకు జన్మనిచ్చిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం ఆమె ప్రసవించిందని కూడా టాక్ వినిపించింది.
మాలీవుడ్ బ్యూటీ అమలాపాల్ కు తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ, మలయాళ సినిమాల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ.. కొన్ని నెలల క్రితం రెండో వివాహం చేసుకుంది. మొదటి భర్తతో విడాకులు తీసుకున్నాక దాదాపు ఆరేళ్ల పాటు ఒంటరిగా ఉన్న బ్యూటీ.. తన బాయ్ ఫ్రెండ్, టూరిజం, హాస్పిటాలిటీ ప్రొఫెషనల్ జగత్ దేశాయ్ తో మళ్లీ వివాహ బంధంలో అడుగు పెట్టింది.
గతేడాది నవంబర్ మొదటి వారంలో కోచిలో అమలా పాల్, జగత్ దేశాయ్ వివాహ బంధంతో ఒకటయ్యారు. ఆ తర్వాత 2024 జనవరి తొలి వారంలో తాను ప్రెగ్నెంట్ అంటూ అమలాపాల్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ మేరకు బేబీ బంప్ ఫొటోలను కూడా షేర్ చేసింది. అప్పటి నుంచి ఎప్పటికప్పుడు ఫోటోలు పోస్ట్ చేస్తూ ఉంది. రీసెంట్ గా గుజరాత్ లోని సూరత్ లో సంప్రదాయ బద్ధంగా జరిగిన సీమంతం వేడుక ఫోటోలు షేర్ చేసింది.
అయితే ఈ బ్యూటీ ఇటీవల కవలలకు జన్మనిచ్చిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. కొన్ని రోజుల క్రితం ఆమె ప్రసవించిందని కూడా టాక్ వినిపించింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అవుతోంది. దీంతో ఈ వార్తలపై అమలా పాల్ స్పందించింది. వాటిని ఖండించింది. ఇంకా ప్రసవమే జరగలేదని తెలిపింది. దీంతో అమలా పాల్ కు కవలలు పుట్టడం అనేది కేవలం రూమర్ మాత్రమేనని తేలింది.
ఇక అమలా పాల్ కెరీర్ విషయానికొస్తే.. సౌత్ ఇండస్ట్రీలోని స్టార్ హీరోలందరి సరసన నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో అనేక చిత్రాల్లో కనిపించింది. 2009లో లాల్ జోస్ దర్శకత్వం వహించిన నీలతామర చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత 2010లో విడుదలైన తమిళ చిత్రం మైనా అమల కెరీర్ లో టర్నింగ్ పాయింట్ గా మారింది.
సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాకు గాను తమిళనాడు ప్రభుత్వం తరఫున ఉత్తమ నటిగా అవార్డు అందుకుంది. ఆ తర్వాత బెజవాడ, ఇద్దరమ్మాయిలతో, నాయక్, జెండాపై కపిరాజు వంటి పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. కానీ ఈ బ్యూటీకి మెల్లగా అవకాశాలు తగ్గిపోయాయి. ఇటీవల విడుదలైన మలయాళం హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ ఆడు జీవితం సినిమాలో కనిపించగా.. ఆ మూవీ మంచి వసూళ్లు సాధించింది.