బిగ్ బాస్ 7 : రన్నర్ అమర్ దీప్ ఎంత సంపాదించాడో తెలుసా..?

అమర్ దీప్ కి వారానికి 2.5 లక్ష చొప్పున పారితోషికంగా డీల్ కుదుర్చుకున్నారట. సో 15 వారాలకు గాను అమర్ దీప్ కి 37,50,000 దాకా రెమ్యునరేషన్ గా అందుకునే అవకాశం ఉంది.

Update: 2023-12-18 07:46 GMT

బిగ్ బాస్ సీజన్ 7 షో ఆదివారంతో పూర్తయింది. కామన్ మ్యాన్ గా వచ్చిన పల్లవి ప్రశాంత్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు. అమర్ దీప్, ప్రశాంత్ ఇద్దరు టాప్ 2 గా ఉండగా ఫైనల్ గా బిగ్ బాస్ ఆడియన్స్ అంతా ప్రశాంత్ ని విజేత అయ్యేందుకు ఓటింగ్ చేశారు. సో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా టైటిల్ కైవసం చేసుకున్నాడు. తన దూకుడుతనంతో టాస్కుల్లో అదరగొడుతూ వచ్చిన ప్రశాంత్ కామన్ మ్యాన్ గా వచ్చినా కంటెస్టెంట్స్ కి టఫ్ ఫైట్ ఇచ్చాడు.

ఇక ప్రీ ఎగ్జిస్టింగ్ ఇమేజ్ తో హౌస్ లోకి వచ్చిన అమర్ దీప్ తన పంథాలో ఆట ఆడి ఆడియన్స్ ని అలరించాడు. మొదటి ఐదు వారాలు ఫౌల్ గేమ్స్ ఆడుతూ వచ్చిన అమర్ దీప్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ మెంబర్స్ వచ్చాక తన ఆట తీరు మార్చుకున్నాడు. అయినా సరే అప్పుడప్పుడు తన ఫౌల్ గేమ్స్ తో హోస్ట్ నాగార్జునకి దొరికి పోయాడు అమర్ దీప్. అమర్ దీప్ కన్నా మైండ్ గేమ్ ఆడి తనతో పాటు యావర్, ప్రశాంత్ లను టాప్ 5 లో నిలబెట్టాడు శివాజీ. అమర్ దీప్ కన్నా టాప్ 2 లో శివాజీ ఉంటాడని కొన్ని అంచనాలు వచ్చినా లాస్ట్ వీక్ అమర్ దీప్ ఫ్యాన్స్ బాగా ఓటింగ్ చేయడంతో అమర్ సెకండ్ ప్లేస్ కి వచ్చాడు.

ఇక బిగ్ బాస్ సీజన్ 7 విన్నర్ గా పల్లవి ప్రశాంత్ 35 లక్షల ప్రైస్ మనీతో పాటుగా సుజుకి బ్రీజా కారు దానితో పాటుగా జోస్ అలుక్కాస్ వారి 15 లక్షల బంగారం గెలుచుకున్నాడు. అయితే 15 వారాల తన రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉండే అవకాశం ఉంది. ఇక రన్నర్ గా నిలిచిన అమర్ దీప్ కి ప్రైస్ మనీ ఏమి లేదు కానీ రెమ్యునరేషన్ భారీగా ఇచ్చారని తెలుస్తుంది.

అమర్ దీప్ కి వారానికి 2.5 లక్ష చొప్పున పారితోషికంగా డీల్ కుదుర్చుకున్నారట. సో 15 వారాలకు గాను అమర్ దీప్ కి 37,50,000 దాకా రెమ్యునరేషన్ గా అందుకునే అవకాశం ఉంది. బిగ్ బాస్ సీజన్ 7 ఇంతకుముందు జరిగిన అన్ని సీజన్ల కంటే బెస్ట్ రేటింగ్ తెచ్చుకుందని తెలుస్తుంది. బిగ్ బాస్ ఫైనల్ ఎపిసోడ్ తర్వాత అమర్ దీప్ ఫ్యాన్స్ ప్రశాంత్ ఫ్యాన్స్ మధ్య గొడవ జరిగింది. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అమర్ దీప్ కారు అద్దాలను పగలకొట్టారు. కొన్నిచోట్ల ఆర్టీసీ బస్సుల అద్దాలు కూడా ధ్వంసం చేసినట్టు తెలుస్తుంది. దీనిపై TSRTC MD సజ్జనార్ ఫైర్ అయ్యారు. ప్రజలను గమ్య స్థానాలకు చేర్చే RTC పై దాడి సమంజసం కాదని, అభిమానం పేరుతో ఇలాంటి పిచ్చి చేష్టలు శ్రేయస్కరం కాదని అన్నారు.

Tags:    

Similar News