చివరకు మిగిలేది అదే.. లైగర్ బ్యూటీ నిర్వేదం..
లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత అనన్య పాండేకు ఊరట నిచ్చే విజయాలు కొన్ని ఉన్నాయి.
లైగర్ లాంటి డిజాస్టర్ తర్వాత అనన్య పాండేకు ఊరట నిచ్చే విజయాలు కొన్ని ఉన్నాయి. CTRL - కాల్ మీ బేలో తన నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కానీ వ్యక్తిగత జీవితంలో ఊహించని వైఫల్యాన్ని ఎదుర్కొని కొంత ఒత్తిడికి లోనైంది. ఆదిత్యా రాయ్ కపూర్ నుంచి విడిపోయిన ఈ బ్యూటీ ఆ తర్వాత కొంతకాలం ఒంటరిగా ఉంది.
ప్రస్తుతం మాజీ మోడల్ వాకర్ బ్లాంకోతో డేటింగ్ లో ఉందని కథనాలొస్తున్నాయి. అనంత్ అంబానీ జంతు సంరక్షణ కేంద్రమైన `వంతారా`లో పనిచేస్తున్న వాకర్ బ్లాంకోతో అనన్య రిలేషన్ లో ఉన్నట్లు పుకార్లు జోరుగా షికార్ చేస్తున్నాయి. అయితే దీనిని అనన్య అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఇటీవల అనన్య సోషల్ మీడియాలో ఒక ఆసక్తికర వ్యాఖ్యను చేసింది. ఈ సంవత్సరం చాలా ప్రేమను అనుభవించాను! అని రాసింది. కొత్త సంవత్సరం గురించి రాస్తూ.. 2025లో ఆరోగ్యం బాగుండాలనే కోరికను కూడా ఆమె వ్యక్తం చేసింది.
2025 ఎలా ఉండాలనుకుంటోందో ప్రస్థావించిన అనన్య తనను చాలా ప్రేమించే వ్యక్తులను కలుసుకున్నానని వ్యాఖ్యానించడంతో మోడల్ బ్లాంకోతో డేటింగ్ ని ఖాయం చేసిందని అభిమానులు ఊహిస్తున్నారు. రాబోవు సంవత్సరంలో మంచి ఆరోగ్యం! కావాలని కోరుకుంది. తనను తాను జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఆవశ్యకతను గుర్తు చేసిన సంవత్సరం 2024 ..ఎందుకంటే మనకు చివరకు మిగిలేది అదే`` అని నిర్వేదంగా రాసింది.
అనన్య- వాకర్ బ్లాంకో మధ్య ఏదో జరుగుతోందనడానికి గతంలోని ఈ బర్త్ డే మెసేజ్ చాలు. ఇటీవలి అనన్య పుట్టినరోజు సందర్భంగా వాకర్ బ్లాంకో హృదయపూర్వక సందేశం ఇచ్చాడు. తన ఇన్‌స్టాలో ఒక పోస్ట్‌ను షేర్ చేస్తూ ``హ్యాపీ బర్త్‌డే బ్యూటిఫుల్!!! మీరు చాలా స్పెషల్. ఐ లవ్ యూ ఎవ్రీథింగ్`` అని రాశారు.
ఈ జంట మొదటిసారి అనంత్ అంబానీ -రాధిక మర్చంట్ వివాహ వేడుకలో కలిసి కనిపించారు. వాకర్‌ను ఈవెంట్‌లో తన 'భాగస్వామి' గా పరిచయం చేసింది అనన్య. తన లవ్ లీ డేట్‌గా వాకర్ పెళ్లికి హాజరయ్యాడు.
అంబానీ పెళ్లిలో తన భాగస్వామి అంటూ వాకర్ ని అందరికీ పరిచయం చేసింది. అనన్య దానిని దాచడానికి ప్రయత్నించలేదు. రొమాంటిక్ సాంగ్ సమయంలో వారు కలిసి డ్యాన్స్ చేయడం కూడా చాలా మంది చూశారు.
అనన్య ప్రస్తుతం `కాల్ మి బే` రెండవ సీజన్ షూటింగ్‌లో ఉంది. సి. శంకరన్ నాయర్ జీవితం ఆధారంగా రూపొందనున్న ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ , ఆర్. మాధవన్‌లతో కలిసి అనన్య నటిస్తోంది.