ఆ బ్యూటీకి ఆ రెండు లేక‌పోయినా ప‌ర్లేదు!

ముఖంలో..బాడీ లో మ‌రే పీచ‌ర్ తో సంబంధం లేకుండా మ‌న‌సుకు నచ్చితే గెడ్డం కుర్రాడిని పెళ్లాడిస్తేనంటోంది.

Update: 2024-05-08 01:30 GMT

పెళ్లి చేసుకునే వాడిలో ర‌క‌ర‌కాల క్వాలిటీలు కోరుకుంటారు అమ్మాయిలు. హైట్..వెయిట్..మంచి ఫిజిక్..గ్లామ‌ర్ ఇలా ప్ర‌తీది న‌చ్చేలా ఉండాలంటారు. అన్నీ ర‌కాలుగా త‌న‌ని మ్యాచ్ చేసేలా ఉండాల‌ని ప్ర‌తీ అమ్మాయి కోరుకుంటుంది. ఇక వివాహం త‌ర్వాత బాగా చూసుకోవాల‌ని..వెకేష‌న్ల‌కు తీసుకెళ్లాల‌ని... ప్ర‌పంచ‌మంతా తిప్పి చూపించాల‌ని ఆశ‌ప‌డే అమ్మాయిలు ఎంతో మంది ఉన్నారు. కానీ ఈ హీరోయిన్ మాత్రం అందుకు భిన్నం.

 

హైట్ అవ‌సరం లేదు..వెయిట్ తో సంబంధం లేదు. మ‌రీ అంత గ్లామ‌ర్ గా ఉండాల్సిన ప‌నిలేదు. ప్ర‌పంచ‌మంతా తిప్పాల్సిన ప‌నిలేదు. మ‌రి ఆ హీరోయిన్ కి కావాల్సింది? ఏంటి అంటారా? అంటే గెడ్డం అంట అండి. అవును ఆ హీరోయిన్ కి పుల్ గా బీయ‌ర్డ్ ఉండాలిట‌. అంతే అందంగా మీస‌క‌ట్టు కూడా ఉండాలిట‌. ఈ రెండు ఉంటే చాలు నేను ప్లాట్ అయిపోతానంటోంది తెలుగు హీరోయిన్ అన‌న్య నాగ‌ళ్ల‌.

ముఖంలో..బాడీ లో మ‌రే పీచ‌ర్ తో సంబంధం లేకుండా మ‌న‌సుకు నచ్చితే గెడ్డం కుర్రాడిని పెళ్లాడిస్తేనంటోంది. గ‌తంలో 'హాయ్ నాన్న' సినిమాలో నాని పాత్ర లాంటి వ్య‌క్తిత్వం ఉన్న కుర్రాడు కావాలి అంది. అంటే అలాంటి కుర్రాడికి గెడ్డం..మీసం అద‌నంగా ఉండాలి తాజాగా జోడించిది అన్న మాట‌. రిలేష‌న్స్ షిప్స్ అంటే ఎప్పుడూ ఓ స్నేహంలా ఉండాల‌ని..అది భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య అయినా అలాంటి స్నేహం ఉండాలి అంటోంది. అప్పుడే ఆ బంధాలు కల‌కాలం నిల‌బ‌డ‌తాయ‌ని అభిప్రాయ‌ప‌డింది.

ఇక అన‌న్య కెరీర్ సోసోగా సాగుతోన్న సంగ‌తి తెలిసిందే. 'మ‌ల్లేషం' నుంచి మొన్న‌టి అన్వేషి వ‌ర‌కూ ఆరేడు సినిమాలు చేసింది. వీటిలో పెద్ద చిత్రం 'వ‌కీల్ సాబ్'. అందులో అమ్మ‌డు ఓ కీల‌క పాత్ర పోషించింది. కానీ కెరీర్ ప‌రంగా అది పెద్ద‌గా క‌లిసి రాలేదు. 'మ‌ల్లేషం' ఇమేజ్ తోనే అవ‌శాలు అందుకుంది. ప్ర‌స్తుతం అమ్మ‌డు 'తంత్ర‌'..'పొట్టేలు' అనే చిత్రాల్లో న‌టిస్తోంది.

Tags:    

Similar News