అవకాశం ఇస్తే ఇలా తిరగబడతారా?
పనిలో పనిగా తన ఆక్రోశం మొత్తం వెళ్లగక్కింది. ఇప్పుడదే పరిశ్రమలో అమ్మడు `భారతీయడు-2` లో నటిస్తోంది.
హీరోయిన్ గా అవకాశం ఎంత కష్టమో ఆ ఛాన్స్ రాని వాళ్లకి తెలుస్తుంది. ఒక్క ఛాన్స్ అంటూ దర్శక-నిర్మాతల చుట్టూ చక్కెర్లు కొట్టిన వారికి తెలుస్తుంది? ఆ కష్టం ఎలా ఉంటుందో? కష్టం లేకుండా అవకాశం వస్తే ఇలాగే ఉంటుంది. అవకాశం ఇచ్చిన వాళ్లపైనే తిరగబడే రోజులొచ్చేసాయ్ అనడానికి వీళ్లే ఉదాహరణ. దక్షిణాదిన సినిమాలు చేసినంత కాలం సైలెంట్ గా ఉన్నా రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత ఎలా ప్లేట్ ఫిరాయించిందో తెలిసిందే? నాకెందకు పాన్ ఇండియా సినిమాల్లో దక్షిణాది వాళ్లు అవకాశాలు ఇవ్వరు? అని కొత్త పల్లవి అందుకుంది.
పనిలో పనిగా తన ఆక్రోశం మొత్తం వెళ్లగక్కింది. ఇప్పుడదే పరిశ్రమలో అమ్మడు `భారతీయడు-2` లో నటిస్తోంది. మరి ఇది పాన్ ఇండియా సినిమానా? కోలీవుడ్ ఛాన్సా? అన్నది ఆమె నిర్ణయానికే వదిలేయాలి. ఇటీవలే `ఆదిపురుష్` చిత్రానికి రచయిత గాపనిచేసిన మనోజ్ కూడా ఇలాగా ఆ సినిమాకి పనిచేసారు పెద్ద తప్పు చేసానని వ్యాఖ్యానించాడు. ఎన్నో మంచి సినిమాలకు పనిచేసాను. తొందరపడి ఆదిపురుష్ కి పనిచేసి విమర్శలు ఎదుర్కున్నాను.
ఇది జీవితంలో చేసిన అతి పెద్ద తప్పు అన్నాడు. నిజానికి ఆయన రాసిన డైలాగుల కారణంగా ఆయన వ్యక్తిగత విమర్శలు ఎదుర్కు న్నాడు. అందుకు ఆయనే బాధ్యుడు. కానీ ఆయన కామెంట్ టీమ్ మొత్తాన్ని బాద్యుల్ని చేసింది. తాజాగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే కూడా అలాగే రియాక్ట్ అయింది. `లైగర్` తో ఈ భామ టాలీవుడ్ కి పరిచయమైన సంగతి తెలిసిందే.
అయితే ఈ సినిమా చేసి చాలా పెద్ద తప్పు చేసానని...తన తల్లిదండ్రుల కారణంగానే ఆ తప్పు చేయాల్సి వచ్చిందని..తన సొంత నిర్ణయాలు అయితే అలా ఉండవని వ్యాఖ్యానించింది. పూరి జగన్నాధ్ సినిమాలో అవకాశం అంటే? అమ్మడికి అంత చిన్న చూపుగా కనిపించింది. అసలు సినిమాలు ప్లాప్ అయితే ఈ రేంజ్ లో రియాక్ట్ అవ్వాలా? ప్లాప్ అయిందన్నది గతం. ఆ తర్వాత అవకాశాలు అనేవి ప్రతిభ మీద ఆధారపడతాయి గానీ..ఇలా ఛాన్స్ ఇచ్చిన వాళ్ల మీద తిరగబడటం అన్నది ఎంత వరకూ న్యాయమో!