పూరి 'రోగ్' ఫేం ఏంజెలా పింక్ లుక్
తాజాగా ఏంజెలా పింక్ డిజైనర్ ఫ్రాక్ ధరించి అదిరిపోయే ఫోజిచ్చింది. 'జస్ట్ గివ్ మి సమ్ విటమిన్ Sea' అని దీనికి క్యాప్షన్ ఇచ్చింది.
వరుణ్ తేజ్ సరసన పూరి తెరకెక్కించిన 'రోగ్'లో కనిపించింది ఏంజెలా క్రిస్లింజ్కి. ఆ తర్వాత జ్యోతిలక్ష్మిలోను కనిపించింది. ప్రత్యేక గీతాల్లో అదిరిపోయే మూవ్స్ తో కిక్కిచ్చింది ఈ బ్యూటీ. అనుష్క సైజ్ జీరో లోను అతిథి పాత్రలో మెరిసింది. బాలీవుడ్ లో 1921- మళంగ్ వంటి చిత్రాల్లోను కనిపించింది. బుల్లితెరపై పలు రియాలిటీ షోలతో చక్కని పాపులారిటీ దక్కించుకుంది. స్ప్లిట్స్‌విల్లా -ఇండియాస్ నెక్స్ట్ సూపర్‌స్టార్ వంటి షోలలో కనిపించిన ఏంజెలా క్రిస్లింజ్కి తన 'చాన్ వి గవా' సహ నటుడు, గాయకుడు మాధవ్ మహాజన్‌ని పెళ్లాడింది.
2019లో రొమాంటిక్ సాంగ్ చన్ వి గవా (మాధవ్ కూడా తన గాత్రాన్ని అందించాడు) షూటింగ్ సమయంలో వారు ప్రేమలో పడ్డారు. మూడు నెలల తర్వాత పెళ్లితో ఒకటయ్యారు. ఈ జంట ప్రేమాయణం పెళ్లి అన్నీ సినిమాటిక్. ఒక అద్భుత ప్రేమ కథ- జంట మధ్య కెమిస్ట్రీకి సంబంధించిన వ్యవహారమిది. పంజాబ్‌లోని జలంధర్‌లో వివాహం చేసుకున్నారు ఈజోడీ.
ఏంజెలా పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైనా కానీ, ఇప్పటికీ సోషల్ మీడియాల్లో అభిమానులకు టచ్ లో ఉంది. ఈ వేదికపై రకరకాల ఫోటోషూట్లను షేర్ చేస్తోంది. తాజాగా ఏంజెలా పింక్ డిజైనర్ ఫ్రాక్ ధరించి అదిరిపోయే ఫోజిచ్చింది. 'జస్ట్ గివ్ మి సమ్ విటమిన్ Sea' అని దీనికి క్యాప్షన్ ఇచ్చింది. అంటే ఈ ఫోటోషూట్ ఏదైనా బీచ్ పరిసరాల్లో చేసినది అని అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఏంజెలా ఫోటోషూట్ అంతర్జాలంలో వైరల్ గా మారుతోంది.