ఖర్చు లేకుండా నిర్మాతకు ఉచిత పబ్లిసిటీ!
మరి నిర్మాతకు ఉచిత పబ్లిసిటీ ఇవ్వడం ఎలా అంటే యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడిని అడగలేమో! అనాలేమో.
సినిమా రిలీజ్ సమయంలో పబ్లిసిటీ కోసం ఎవరి స్ట్రాటజీ తో వారు ముందుకెళ్తుంటారు. ఎవరు ఎలాంటి స్ట్రాటజీతో వెళ్లినా అంతిమంగా రిలీజ్ సమయానికి సినిమా జనాల్లోకి వెళ్లడం ముఖ్యం. ఇక్కడే ఎవరి మేధాతనం వారు ఉప యోగిస్తుంటారు. `బాహుబలి`, `ఆర్ ఆర్ ఆర్` రిలీజ్ సమయంలో రాజమౌళి డిఫరెంట్ స్ట్రాటజీతో ఆ రెండు సినిమాల్ని జనాల్లోకి తీసుకెళ్లి సక్సెస్ అయ్యారు. అందుకోసం ఆయన కొంత ఖర్చు చేసారు.
మరి నిర్మాతకు ఉచిత పబ్లిసిటీ ఇవ్వడం ఎలా అంటే యంగ్ డైరెక్టర్ అనీల్ రావిపూడిని అడగలేమో! అనాలేమో. అనీల్ తన సినిమాల రిలీజ్ సమయంలో నిర్మాత నుంచి రూపాయి ఖర్చు చేయనివ్వడం పబ్లిసిటీ చేస్తుంటాడు. అందులో నటించిన నటీనులనే ప్రచార కర్తలుగా వినియోగించుకుంటాడు. ఈ విషయంలో హీరోయిన్లు కూడా వదలడు. వాళ్లతో ఆ సినిమాలో పాటలకు డాన్సులు చేయించిన వీడియోల్ని బయటకు వదులుతుంటాడు.
అందమైన హీరోయిన్లు వీడియోలు చూస్తే లక్షల మంది చూస్తారు. సోషల్ మీడియాలో అవి వైరల్ గానూ మారుతుంటాయి. `భగవంత్ కేసరి` రిలీజ్ సమయంలో కాజల్ అగర్వాల్, శ్రీలీలతో అలాంటి వీడియో ఒకటి చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు సినిమాల విషయంలోనూ ఇదే స్ట్రాటజీ తో ముందుకెళ్లారు. తాజాగా విక్టరీ వెంకటేష్ తో తెరకెక్కించిన `సంక్రాంతి వస్తున్నాం` చిత్రం జనవరిలో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో పబ్లిసీటీలో భాగంగా స్పెషల్ కాన్సెప్ట్ లతో వీడియోలు చేసి రిలీజ్ చేస్తున్నాడు. అలాగే మీడియా మీట్ లో వేదికపై హీరో, హీరోయిన్లతో రకరకాల ఫీట్లు చేయిస్తున్నాడు. తన సినిమా కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని మీడియాకి టాస్క్ లు విసిరుతున్నాడు. తద్వారా ఆ సినిమా గురించి ఎక్కువగా ఫిల్మ్ మీడియాలో డిస్కషన్ జరుగుతుంది. అది జనాల్లోకి బలంగా వెళ్తుంది. ఇలాంటి ప్రచారం నిర్మాత జేబు నుంచి రూపాయి తీయనివ్వదు. అంతా ఉచితంగానే.