భగవంత్ కేసరి.. తరువాత ఎవరు అనిల్?

అయితే ఈ సినిమా అనంతరం అనిల్ రావిపూడి ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయంలో మాత్రం ఇంకా అధికారికంగా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు.

Update: 2023-07-15 15:21 GMT

ఇప్పుడున్న యువ దర్శకులలో మంచి కమర్షియల్ దర్శకుడిగా గుర్తింపును అందుకున్న వారిలో అనిల్ రావిపూడి ఒకరు. ఈ దర్శకుడు ఏ హీరోతో సినిమా చేసిన కూడా ఆడియన్స్ కు అన్ని రకాల ఎంటర్టైన్మెంట్ డోస్ అందించే విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వివిధ కోణాల్లో కాస్త ట్రోల్స్ ఎదుర్కొన్నప్పటికీ కూడా అనిల్ రావిపూడి మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ప్రతి సినిమాతోనే మంచి కలెక్షన్స్ అయితే అందిస్తూనే ఉన్నాడు.

అతన్ని నమ్ముకున్న నిర్మాత మాత్రం ఇప్పటివరకు నష్టపోనేలేదు. ఇక కమర్షియల్ హంగులతో మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలను అందించగలడు అని హీరోల్లో కూడా అతనిపై నమ్మకం పెరుగుతోంది. ఇక ఇలాంటి దర్శకుడు సినిమా చేయాలి అని చాలామంది హీరోలు అనుకుంటున్నారు. అనిల్ రావిపూడి కూడా వీలైనంతవరకు కొత్త తరహా లోనే మంచి కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ సినిమాలను అందించే ప్రయత్నం చేస్తున్నాడు.

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణతో భగవంత్ కేసరి అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా ఈ ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ సినిమా అనంతరం అనిల్ రావిపూడి ఎవరితో సినిమా చేస్తాడు అనే విషయంలో మాత్రం ఇంకా అధికారికంగా ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు. చర్చల్లో కొంతమంది హీరోల పేరు ఉన్నట్లుగా అప్పట్లో టాక్ అయితే వచ్చింది. కానీ అనిల్ రావిపూడి మాత్రం పెద్దగా రియాక్ట్ అవ్వలేదు.

ఇక ప్రస్తుతం అయితే అతని ఫోకస్ చిరంజీవి పై పడినట్లుగా తెలుస్తోంది. చిరంజీవి కూడా అనిల్ రావిపూడి తో సినిమా చేయాలని ఆలోచనలోనే ఉన్నాడు. ఇక ప్రస్తుతం మెగాస్టార్ భోళా శంకర సినిమాను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాడు. మరోవైపు బంగార్రాజు ఫేమ్ కళ్యాణ్ కృష్ణ తో కొత్త ప్రాజెక్టును తెరపైకి తీసుకురావడానికి రెడీ అవుతున్నాడు.

అలాగే బింబిసార దర్శకుడు వశిష్ట కూడా మెగాస్టార్తో సినిమా చేయాల్సి ఉంది. ఇక ఈ రెండు ప్రాజెక్టులలో ముందుగా కళ్యాణ్ కృష్ణ ప్రాజెక్టును ఫినిష్ చేసి ఆ తర్వాత ఒకేసారి అనిల్ రావిపూడి ప్రాజెక్టును అలాగే వశిష్ట ప్రాజెక్టును కొనసాగించాలి అని మెగాస్టార్ అనుకుంటున్నారు. మరి ఈ ప్లాన్ ఎంతవరకు వర్క్ అవుట్ అవుతుందో చూడాలి.

Tags:    

Similar News