ట్రైలర్ చూసాను.. మెంటలొచ్చేసింది: మహేష్
రణబీర్ కథానాయకుడిగా, సందీప్ వంగా తెరకెక్కించిన యానిమల్ ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్శిటీలో భారీ జనసందోహం నడుమ అత్యంత భారీగా జరిగింది
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తన సినిమాల ప్రీరిలీజ్ లకే రావడానికి ఇబ్బంది పడతానని అన్నారు. అలాంటిది ఈరోజు రణబీర్ కపూర్ నటించిన యానిమల్ ప్రీరిలీజ్ వేడుకకు విచ్చేసారు. సుమారు 2గంటలు పైగా ఈ వేదిక వద్ద వేచి చూసారు. చివరిగా వేదికపై యానిమల్ టీమ్ ని బ్లెస్ చేసారు. ఇది అరుదైన దృశ్యం. ఇక ఇదే వేదికపై తాను రణబీర్ కపూర్ కి వీరాభిమానిని అని ఇండియాలోనే ది బెస్ట్ యాక్టర్ రణబీర్ అని పొగిడేశారు మహేష్.
రణబీర్ కథానాయకుడిగా, సందీప్ వంగా తెరకెక్కించిన యానిమల్ ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్శిటీలో భారీ జనసందోహం నడుమ అత్యంత భారీగా జరిగింది. ఈ వేడుకలో రణబీర్-మహేష్ బాబు- రాజమౌళి- బాబి డియోల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సందీప్ వంగా, రష్మిక మందన సహా నిర్మాతలు ఈ వేదికపై హాజరయ్యారు. ఈ వేదికపై మహేష్ బాబు మాట్లాడుతూ రణబీర్ అండ్ టీమ్ ని విష్ చేసారు. సందీప్ వంగా గురించి మహేష్ మాట్లాడుతూ -''సందీప్ ప్రీరిలీజ్ కి రావాలని అడిగాడు. నాకు నా ప్రీరిలీజ్ లకు వెళ్లడమే ఇబ్బంది. కానీ వెళ్లాలనిపించింది. అందుకే వచ్చాను. యానిమల్ ట్రైలర్ చూసాను.. మెంటలొచ్చేసింది! ఇంత ఒరిజినల్ ట్రైలర్ నేనైతే ఇంతవరకూ చూడలేదు. సందీప్ అంటే నాకు చాలా ఇష్టం. అతడు చాలా స్పెసల్.. యూనిక్.. యు ఆర్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఒరిజినల్ ఫిలింమేకర్ ఇన్ ది కంట్రీ..'' అంటూ పొగిడేశారు. యానిమల్ అడ్వాన్స్ బుకింగులు సెన్సేషన్ అని ఎవరో చెప్పారు. ఇప్పుడు ఇది ప్రీరిలీజ్ లా లేదు. 100రోజుల వేడుకల ఉంది... యానిమల్ టీమ్ కి శుభాకాంక్షలు.. అని అన్నారు.
వేదికపై సీనియర్ నటుడు అనీల్ కపూర్ ని ఉద్ధేశించి మాట్లాడిన మహేష్ ఆయన లుక్ పై ప్రశంసలు కురిపించారు. ఈ వయసులో అనీల్ సర్ .. మీ బాడీ వర్క్.. స్క్రీన్ ప్రెజెన్స్ ఎంతో అద్భుతం .. మీ నటనకు గూస్ బంప్స్ వచ్చాయి... అని కూడా పొగిడేశారు. బాబీని టీజర్ ఎండ్ లో చూసి మైండ్ బ్లో అయిందని అన్నారు. ముఖ్యంగా రణబీర్ గురించి మాట్లాడుతూ మహేష్ ఎంతో ఎగ్జయిట్ అయ్యారు. ''నేను రణబీర్ కి చాలా పెద్ద ఫ్యాన్.. స్టేజ్ మీద చెబుతున్నా.. రణబీర్ ఈజ్ ది బెస్ట్ యాక్టర్ ఇన్ ఇండియా. యానిమల్ వర్క్ ది బెస్ట్.. శుభాకాంక్షలు మై బ్రదర్'' అని పొగిడేశారు. అన్ని భాషల్లోను నటించేసిన రష్మిక మందన ఈ స్థాయికి ఎదిగేసినందుకు శుభాకాంక్షలు తెలిపారు.