ఇక్కడీయన..అక్కడాయన భలే సెట్ అయ్యారే!
అతడని అంతా అభిమానిస్తారు. ప్రేమిస్తారు. కానీ అందరి ప్రేమ కంటే నా ప్రేమాభిమానం గొప్పదని సంగీత దర్శకుడు అనిరుద్ మాత్రం చాటుతున్నాడు.
మెగాస్టార్ చిరంజీవిపై నా అభిమానమంతా నా సినిమాలో కనిపిస్తుందని..అతడిని ఓఅభిమానిగా డైరెక్ట్ చేసి హిట్కొట్టి చూపిస్తానని దర్శకుడు బాబి ప్రామిస్ చేసాడు. అన్నట్లుగానే మెగాస్టార్ తో 'వాల్తేరు వీరయ్య' అనే మాస్ సినిమా చేసి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు. ఈ విషయంలో చిరంజీవి సైతం ఎంతో సంతోషంగా ఫీలయ్యారు. బాబి వేదికపై అలా మాట్లాడుతుంటూ చిరంజీవి కంట నీళ్లు తిరిగాయి.
బాబి నన్ను ఇంతగా అభిమానిస్తున్నాడా? అని ఆనందబాష్పాలు రాల్చాలు చిరు. ఇంతవరకూ ఏ హీరో విషయంలో ఏ దర్శకుడు ఇలా మాట్లాడింది లేదు. మనసు లోతుల్లోననుంచి వచ్చిన మాటలవి. తాజాగా కోలీవుడ్ లోనూ ఇలాంటి అభిమానం ఒకటి బయట పడింది. సూపర్ స్టార్ రజనీకాంత్ ని అభిమానించనది ఎవరుంటారు? అతడని అంతా అభిమానిస్తారు. ప్రేమిస్తారు. కానీ అందరి ప్రేమ కంటే నా ప్రేమాభిమానం గొప్పదని సంగీత దర్శకుడు అనిరుద్ మాత్రం చాటుతున్నాడు.
'జైలర్' సినిమా కి ఎలాంటి మ్యూజిక్ అందిచాడో? తెలిసిందే. అనిరుద్ మ్యూజిక్..బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోనే సినిమా సంగం సక్సెస్ అయిపోయింది. ఇక ప్రీ రిలీజ్ వేడుకలో ఏకంగా లైవ్ పెర్పార్మెన్స్ తోనూ అలరిం చాడు. అందుకే రజనీ మరసారి వెట్టేయాన్కి కూడా ఆయన్నే సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. ఈ మధ్యే 'మనసిలాయో' అంటూ ఓ పాట లాంచ్ అయింది. అది సోషల్ మీడియాను ఒక ఊపుఊపేసింది.
రజనీకాంత్ అంటే అనిరుధ్‌కు ఎంత ప్రేమ అన్నది తన సంగీతంలో తెలుస్తుంది. వేదికపై మాటలతోనూ తన అభిమానాన్ని ఎంతో గొప్పగా చాటుకుంటాడు. వెట్టేయాన్ వేదికపైనా అదే ప్రేమని షేర్చేసాడు. తాను బేసిగ్గా జాలీ టైప్ అని, కానీ రజినీ సినిమాకు సంగీతం అందిస్తున్నపుడు, ఆయన సినిమాలు చూస్తు న్నపుడు ఎమోషనల్ అయిపోతానన్నాడు. సూపర్ స్టార్కి తానెప్పుడు డైహార్డ్ ఫ్యాన్‌గానే ఉంటానన్నాడు.