యంగ్ టైగర్ ఖాతాలో మరో అరుదైన ఘనత!
తాజాగా ప్రఖ్యాత ఏషియన్ వీక్లీ న్యూస్ ఈస్టర్న్ ఐ 2023 పేరిట ప్రకటించిన టాప్ 50 ఏషియన్ స్టార్లలో తారక్ స్థానం దక్కించుకున్నాడు.
'ఆర్ ఆర్ ఆర్' తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ గ్లోబల్ స్థాయిలో ఏ రేంజ్ లో ప్రమోట్ అయ్యాడో తెలిసిందే. హాలీవుడ్ దిగ్గజాలే మెచ్చిన నటుడిగా ఖ్యాతికెక్కాడు. ఆస్కార్ కమిటీలో స్థానం స్థానం సంపాదించిన నటుడిగా నీరాజనాలు అందుకుంటున్నాడు. ఇంటర్నేషనల్ మేగజీన్స్ పైనా తారక్ మెరిసాడు. తెలుగు సినిమాకి ఆస్కార్ రావడంలోనూ కీలక పాత్రధారి అయ్యాడు. ఈ నేపథ్యంలో తాజాగా మరో ఘనతను సాధించాడు.
తాజాగా ప్రఖ్యాత ఏషియన్ వీక్లీ న్యూస్ ఈస్టర్న్ ఐ 2023 పేరిట ప్రకటించిన టాప్ 50 ఏషియన్ స్టార్లలో తారక్ స్థానం దక్కించుకున్నాడు.ఈ లిస్ట్ లో యంగ్ టైగర్ కి 25వ స్థానం దక్కింది. ఏషియన్ వీక్లీ న్యూస్ మేగజీన్ బ్రిటన్ లో ఎంతో పాప్యులారిటీ ఉంది. టాలీవుడ్ నుంచి ఈ ఘతన సాధించిన ఏకైక తెలుగు వాడిగా..భారతీయుడుగా తారక్ రికార్డు సృష్టించాడు. ఇంతవరకూ ఇలాంటి గౌరవం ఏ భారతీయ నటుడికి దక్కలేదు.
ఆ రకంగా తారక్ కెరీర్ లో ఇదో రికార్డు గా చెప్పొచ్చు. యంగ్ టైగర్ నటుడిగా ఎదుగుతూనే ఇలా అంతార్జాతీయ వేదికలపైనా మెరవడం పట్ల అభిమానలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ అభిమాన నటుడు ఇలాంటి ఘన చరిత్రలు మరిన్ని నమోదు చేయాలని విశెష్ తెలియజేస్తున్నారు. వార్-2 సినిమాతో తారక్ బాలీవుడ్ లోకి అడుగు పెడుతోన్న సంగతి తెలిసిందే. అందులో హృతిక్ రోషన్ తో కలిసి నటిస్తున్నాడు.
మరి ఇందులో తారక్ నెగిటివ్ రోల్ పోషిస్తున్నాడా? పాజిటివ్ రోల్ పోషిస్తున్నాడా? అన్నది తెలియాలి. మరోవైపు కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియాలో `దేవర` సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే `దేవర`పై అంచనాలు పీక్స్ కి చేర్చేసాడు. ఇందులో సరికొత్త తారక్ ని ఆవిష్కరించబో తున్నాడు. సముద్ర గర్భంలో టైగర్ విన్యాసాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయని స్టంట్ మాస్టర్లు ధీమా వ్యక్తం చేస్తోన్న సంగతి తెలిసిందే. దీనికితోడు టైగర్ కి జోడీగా బాలీవుడ్ నటి జాన్వీకపూర్ కథానాయికగా నటిస్తోంది. ఇందులో విలన్ గా బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నాడు.