అనుష్క ఘాటి వాటి సరసన నిలుస్తుందా..?
ఆ సినిమా తర్వాత మళ్లీ గ్యాప్ తీసుకుంటుందని అనుకోగా క్రిష్ చెప్పిన కథ నచ్చి సినిమా ఫిక్స్ చేసుకుంది.
స్వీటీ అనుష్క సినిమాల వేగం తగ్గించి ఆమె ఫ్యాన్స్ ని ఇబ్బంది పెడుతుంది. స్టార్ హీరోలకు ఈక్వల్ రేంజ్ పాపులారిటీ క్రేజ్ తెచ్చుకున్న అనుష్క ఫిమేల్ సెంట్రిక్ సినిమాలతో అదరగొట్టేసింది. ఆమె చేసిన అరుంధతి, భాగమతి, రుద్రమదేవి సినిమాలు ఇప్పటికీ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేస్తాయి. ఐతే తన లుక్ విషయంలో ఇబ్బంది పడుతూ మూడు నాలుగేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టితో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఆ సినిమా తర్వాత మళ్లీ గ్యాప్ తీసుకుంటుందని అనుకోగా క్రిష్ చెప్పిన కథ నచ్చి సినిమా ఫిక్స్ చేసుకుంది. క్రిష్ డైరెక్షన్ లో స్వీటీ అనుష్క చేస్తున్న ఘాటి సినిమా సెట్స్ మీద ఉంది. ఏప్రిల్ రెండో వారం లో ఈ సినిమా రిలీజ్ లాక్ చేశారు. ఈ సినిమాను యువి క్రియేషన్స్ నిర్మిస్తున్నారు. ఘాటి సినిమా గ్లింప్స్ ఆడియన్స్ ని సర్ ప్రైజ్ చేసింది. ఈ సినిమా అనుష్క సూపర్ హిట్ సినిమాలు అరుంధతి, భాగమతి రేంజ్ లో ఉంటుందా అనే రేంజ్ అంచనాలు పెరిగాయి.
అనుష్క సినిమా ఆశించిన స్థాయిలో ఉంటే మాత్రం కచ్చితంగా సినిమా నెక్స్ట్ లెవెల్ అనిపించేస్తుంది. స్వీటీ ఫ్యాన్స్ ఆమె సినిమా కోసం ఎంతో ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ఐతే అనుష్క ఈ గ్యాప్ ని కవర్ చేసేలా సూపర్ హిట్ కొట్టేలా ఉంది. క్రిష్ కూడా తన కమ్ బ్యాక్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందుకే ఘాటి మీద ఫుల్ ఫోకస్ పెట్టాడు. అనుష్క కేవలం ఇలాంటి సినిమాలే చేస్తుందా రెగ్యులర్ సినిమాలు చేయదా అంటే చేస్తుందేమో కానీ ఆమెకు నచ్చిన సినిమాలు కుదరాలి కదా అని చెబుతున్నారు.
మళ్లీ అనుష్క కమర్షియల్ సినిమాలు, స్టార్స్ తో జత కడితే చూడాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. ఘాటి రిజల్ట్ ని బట్టి అనుష్క నెక్స్ట్ ప్లానింగ్ ఉంటుందని చెప్పొచ్చు. అనుష్క ఘాటి సినిమాను కేవలం తెలుగులోనే కాదు పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా సక్సెస్ అందుకుంటే మాత్రం అనుష్క ఇక వరుస సినిమాలు చేసే అవకాశం ఉంటుందని చెప్పొచ్చు. మరి ఘాటి అనుష్క ఫ్యాన్స్ ఆశలను నెరవేరుస్తుందా లేదా అన్నది సినిమా వచ్చాక తెలుస్తుంది. స్టార్ సినిమాల కన్నా అనుష్క ఇలా లేడీ ఓరియెంటెడ్ సినిమాలకే ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది.