70 వ‌య‌సు న‌టుడు ఆ అందానికి ప‌ర‌వ‌శించి..!

అలాంటి ఒక ఆద‌మ‌ర‌పు మైమ‌ర‌పు.. ఆ సీనియ‌ర్ న‌టుడితో ఓ మై గాడ్ అనిపించింది.

Update: 2024-07-22 05:42 GMT

ఒక్కోసారి 'అందం' మైమ‌రిపిస్తుంది. మ‌తులు చెడ‌గొడుతుంది! 60 నుంచి 20 వ‌ర‌కూ.. సీనియ‌ర్ అయినా జూనియ‌ర్ అయినా ఆ స‌మ‌యంలో ఓ మై గాడ్ అనాల్సిందే! అలాంటి ఒక ఆద‌మ‌ర‌పు మైమ‌ర‌పు.. ఆ సీనియ‌ర్ న‌టుడితో ఓ మై గాడ్ అనిపించింది. కానీ అత‌డు ప్ర‌జ‌ల‌కు ప‌బ్లిగ్గా దొరికిపోయాడు. ఇంకేం ఉంది ఒక‌టే ట్రోలింగ్!

గియుసేప్ టోర్నాటోర్ దర్శకత్వం వహించిన 2000 రొమాంటిక్ డ్రామా 'మలేనా'లో ఇటాలియన్ నటి కం మోడల్ మోనికా బెల్లూచి అందానికి స్పెల్ బౌండ్ కాని ఆడియెన్ ఉండ‌రు. ఆ అందాన్ని చూసి మైమ‌రిచిన ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టుడు ప‌రేష్ రావ‌ల్ (70) తీవ్ర‌మైన ట్రోలింగ్ ని ఎదుర్కొంటున్నారు. 70 వ‌య‌సులో ఆయ‌నలో ఈ వైఖ‌రి ఏమిటీ? అంటూ అంద‌రూ ఆశ్చ‌ర్య‌పోయారు. అత‌డు తన X (గతంలో ట్విట్టర్)లో మ‌లేనా చిత్రం నుండి ఒక అంద‌మైన ఆక‌ర్ష‌ణీయ‌మైన‌ క్లిప్‌ను పోస్ట్ చేసి 'ఓ మై గాడ్' అని వ్యాఖ్య‌ను జోడించాడు. దీనికి స్పందించిన‌ నెటిజన్లు అతడిని ట్రోల్ చేస్తూ వీడియోని మ‌ళ్లీ వైర‌ల్ చేసారు. ''ఓ మై గాడ్! చాలా అందంగా ఎగ్జయిట్ చేస్తోంది!..ఈ వీడియో ఎప్పటికీ ముగియకూడదని మీరు కోరుకుంటారు! @మోనికా బెల్లూసీ'' అని ప‌రేష్ రావ‌ల్ ట్వీట్ చేసారు.

ఈ ట్వీట్‌పై స్పందిస్తూ పలువురు నెటిజన్లు ప‌రేష్‌ని ర‌క‌రకాలుగా ట్రోల్ చేశారు. ''పెద్ద పబ్లిక్ పర్సనాలిటీ ఇలాంటి ట్వీట్ చేస్తారని ఎప్పుడూ ఊహించలేదు. మనం వింత ప్రపంచంలో జీవిస్తున్నామని ఎలా చెప్పగలం'' అని ఒక‌రు ఘాటుగా స్పందించారు. ఒక నెటిజన్ ''భాయ్ సాహబ్ యే కిస్ లైన్ మే ఆ గయే ఆప్'' అని రాశారు. ఒక స్పంద‌న ఇలా ఉంది. ''బ్రో తన బర్న్ ఖాతాకు మారడం మర్చిపోయాడు'' అని వ్యాఖ్యానించారు. సీనియ‌ర్ న‌టుడు ఊహించ‌ని ట్రోలింగ్ జ‌రుగుతోంది. ఇప్ప‌టికీ అత‌డి ఎక్స్ ఖాతాపై దాడి జ‌రుగుతూనే ఉంది.

మ‌రోవైపు ప‌రేష్ వ‌రుసగా సీక్వెల్ చిత్రాల‌తో బిజీగా ఉన్నారు. వెల్‌కమ్ ఫ్రాంచైజీ మూడవ భాగం 'వెల్‌కమ్ టు ది జంగిల్'లో పరేష్ మరోసారి అక్షయ్ కుమార్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రంలో దిశా పటానీ, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, అర్షద్ వార్సీ, సునీల్ శెట్టి, రవీనా టాండన్, పరేష్ రావల్, లారా దత్తా, తుషార్ కపూర్, శ్రేయాస్ తల్పాడే, జానీ లివర్, రాజ్‌పాల్ యాదవ్, కికు శారదా, మికా శారదా, దలేర్ తదితరులు న‌టిస్తున్నారు.

'వెల్‌కమ్ టు ది జంగిల్' డిసెంబర్ 2024లో థియేటర్‌లలో విడుద‌ల కానుంది. అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న‌ ఈ చిత్రాన్ని జ్యోతి దేశ్‌పాండే - ఫిరోజ్ ఎ నదియాద్‌వాల్లా నిర్మిస్తున్నారు.

నటుడు హేరా ఫేరి 3లో బాబూరావు గణపత్రావ్ ఆప్టే పాత్రను కూడా మళ్లీ పోషిస్తున్నారు. హేరా ఫేరీ 3 ప్రొడ‌క్ష‌న్ ద‌శ‌లో ఉంది. పరేష్ రావల్ ఈ ప్రాజెక్ట్ క్రేజీ అన్నాడు. చాలా ఏళ్ల తర్వాత విడుదలవుతున్న ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుంటుందే లేదోన‌ని పరేష్‌ భయపడుతున్నాడు. ఉత్సాహం ఉంది, కానీ దానితో పాటు చాలా భయము కూడా ఉంది. తుది ఉత్పత్తి ఊహించిన విధంగానే రావాలని నేను కొన్నిసార్లు భయపడుతున్నాను. మనకు అంచనాలు ఉంటాయి.. కానీ మనకంటే ప్రేక్షకులకు అంచనాలు మ‌రీ ఎక్కువ‌ ఉంటాయి. హేరా ఫేరి, వెల్‌కమ్ కోసం వారు చాలా కాలం వేచి ఉన్నారు. కాబట్టి నేను భయపడుతున్నాను.. అని ప‌రేష్ అన్నారు.



Tags:    

Similar News