సెట్స్ లోని అందరినీ చెక్ చేయడానికే 3 గంటల టైమ్!
రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ మురుగదాస్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సికిందర్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను బయట పెడుతున్నారు.;
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన సినిమా సికిందర్. మురుగుదాస్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఈద్ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. సికిందర్ లో సల్మాన్ సరసన రష్మిక హీరోయిన్ గా నటించింది. రిలీజ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ మురుగదాస్ పలు ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సికిందర్ కు సంబంధించిన ఆసక్తికర విషయాలను బయటపెడుతున్నారు.
మాస్ మూవీగా తెరకెక్కిన సికిందర్ లో చాలా సీన్స్ ఎక్కువమందితో చేయాల్సి వచ్చిందని, ఒక్కోసారి సెట్స్ లో 10 నుంచి 20 వేల మంది వరకు కూడా ఉండేవారని, వారందరితో కలిసి సల్మాన్ సీన్ చేయాల్సి వచ్చేదని, అంతమందితో షూటింగ్ అంటే ఎంతో సెక్యూరిటీ, టైమ్ సెన్స్ అవసరం. ఇదంతా ముందుగానే ప్లాన్ చేసుకోవడంతో తమ షెడ్యూల్స్ మొత్తం అనుకున్న టైమ్ కు పూర్తవుతాయి అనుకున్నారట మురుగదాస్.
కానీ అదే టైమ్ లో సల్మాన్ కు బెదిరింపులు రావడంతో షూటింగ్ మరింత బిజీగా మారిందని ఆయన తెలిపారు. సల్మాన్ కు వచ్చిన బెదిరింపులను దృష్టిలో ఉంచుకుని సెక్యూరిటీని మరింత టైట్ చేశామని, దీంతో అక్కడ సెట్స్ లోని అందరినీ చెక్ చేయడానికే 3 గంటల టైమ్ పట్టి, రోజూ షూటింగ్ లేటయ్యేదని, సికిందర్ షూటింగ్ మొత్తం ఆల్మోస్ట్ అలానే పూర్తి చేసినట్టు డైరెక్టర్ మురుగదాస్ చెప్పారు.
సల్మాన్ అందరి హీరోల కంటే భిన్నంగా ఉంటారని, ఆయనతో వర్క్ చేయడం చాలా సంతోషాన్నిచ్చిందని మురుగదాస్ అన్నారు. ఇక సినిమా గురించి చెప్తూ సికిందర్ మూవీలో ఎన్నో సర్‌ప్రైజ్‌లు, ట్విస్టులు ఉంటాయన్నారు. ఇది కేవలం మాస్ మూవీ మాత్రమే కాదని, సికిందర్ లో చాలా స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్నాయని మురుగదాస్ చెప్పారు.
గజినీ మూవీలో లవ్ స్టోరీని ఎలివేట్ చేశానని, ఇప్పుడు సికిందర్ లో భార్యాభర్తల మధ్య సంబంధాన్ని వివరించామని చెప్పిన మురుగదాస్, ఈ మూవీలో హీరోహీరోయిన్ల మధ్యవచ్చే లవ్ స్టోరీ ప్రతీ ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుందని, మూవీలోని ఎన్నో సీన్స్ ను ఆడియన్స్ కనెక్ట్ అవుతారని ఆయన తెలిపారు.