ఒక రాంబో.. ఒక టెర్మినేటర్.. ఒక ఈగల్..!
అయితే అసలు ఆ సమస్య ఏంటి.. దాన్ని సహదేవ్ ఎలా ఎదుర్కొన్నాడు అన్నదే సినిమా కథ అని చెప్పారు.
సినిమాటోగ్రాఫర్ గా చేస్తూ డైరెక్షన్ చేసే వారు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో కార్తీక్ ఘట్టమనేని ఒకరు. లేటెస్ట్ గా మాస్ మహరాజ్ రవితేజతో ఈగల్ సినిమా డైరెక్ట్ చేసిన కార్తీక్ ఘట్టమనేని ఆ సినిమా ప్రమోషన్స్ లో సినిమా మెయిన్ థీం ఇంకా సినిమా కోసం పెట్టిన హార్డ్ వర్క్ గురించి చెప్పుకొచ్చారు. ఈగల్ టీజర్, ట్రైలర్ లో విధ్వంసం అనేది ప్రధానంగా వినిపిస్తుంది. దానికి డైరెక్టర్ క్లారిటీ ఇచ్చారు. ఈగల్ సినిమా కథలోనే విధ్వంసం ఉంది. లార్జర్ దేన్ లైఫ్ ఎంటర్టైనర్ దీనిలో రవితేజ పత్తి రైతు సహదేవ్ గా కనిపిస్తారు. సమాజం కోసం ఒక ఇంటరేషనల్ ప్రాబ్లం పై ఫైట్ చేస్తాడు. విధ్వంసం సృష్టిస్తాడు. అయితే అసలు ఆ సమస్య ఏంటి.. దాన్ని సహదేవ్ ఎలా ఎదుర్కొన్నాడు అన్నదే సినిమా కథ అని చెప్పారు.
ఈ సినిమాను డైరెక్టర్ కార్తీక్ హాలీవుడ్ సినిమాలు రాంబో, టెర్మినేటర్ సినిమాలతో పోల్చుతూ వాటిని చూసి మనం ఎలా ఎంజాయ్ చేశామో అలాంటి సినిమా తీయాలనే ప్రయత్నంలో ఈగల్ చేశానని అన్నారు. ఈగల్ ఒక మంచి యాక్షన్ డ్రామా.. ఆడియన్స్ దీన్ని బాగా ఆస్వాధిస్తారని అన్నారు రవితేజ. ఈ సినిమా సౌండ్ డిజైన్ కోసం ఆరు నెలలు కష్టపడాల్సి వచ్చింది. యూరప్ లో రియల్ గన్స్ తో షూట్ చేసి ఆ సౌండ్ రికార్డ్ చేశామని కార్తీక్ చెప్పారు.
కోవిడ్ లాక్ డౌన్ టైం లో ఈ కథ రాసుకున్నానని చెప్పిన కార్తీక్ హీరోది 45 ఎల్ల వయసు ఉన్న పాత్ర. పాత్రలో చాలా యాంగిల్స్ ఉంటాయి. ఆ పాత్రలు రవితేజ అయితేనే పర్ఫెక్ట్ అని ధమాకా సినిమాకు కెమెరా మెన్ గా చేస్తున్నప్పుడు ఈ కథ చెప్పా.. కథ విన్న రవితేజ గారు మంచి కమర్షియల్ సినిమా చేసేద్దాం అన్నారు. అలా ఈ సినిమా మొదలైందని చెప్పారు.
ఈ సినిమా స్క్రీన్ ప్లే కూడా చాలా స్పెషల్ గా ఉంటుందని అన్నారు కార్తీక్. కథ సెకండరీ కాస్ట్ చాలా ముఖ్యమని భావించాం. అందుకే ఆ పాత్రల ద్వారా కథానాయకుడు గురించి చెప్పాం. రషోమన్, విక్రం, విరుమాండి సినిమాల పంథాలో ఇది ఉంటుందని అన్నారు కార్తీక్. సినిమా చూశాక ట్రైలర్ చూస్తే అప్పుడు కథాంశం చెప్పామని అర్థమవుతుందని అన్నారు.
ఈ కథ ఫారిన్ లో జరిగిన ఒక కథాంశాన్ని స్పూర్తిగా తీసుకుని ఫిక్షనల్ గా చెప్పాలని అన్నారు. ఈ సినిమాకు హిందీలో సహదేవ్ అని టైటిల్ పెట్టాం. ఆల్రెడీ అక్కడ ఈగల్ టైటిల్ తో ఒక సినిమా సెట్స్ మీద ఉంది. అందుకే ఆ టైటిల్ పెట్టామని అన్నారు. ఈగల్ కథ పూర్తవుతుంది. అయితే ఈగల్ కి సీక్వెల్ కూడా ఉంటుంది. ఈగల్ క్లైమాక్స్ ఆడియన్స్ ని అలరిస్తుందని అన్నారు. ఈగల్ సెకండ్ పార్ట్ టైటిల్ గా యుద్ధ కాండ అని పెడుతున్నట్టు టాక్.