పిరుదుల ఎత్తు పెంచే వైద్యం వికటించి నటి మరణం
అందమైన మోడల్ కం నటి మరణం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
అందమైన మోడల్ కం నటి మరణం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆమె ఆకస్మిక మరణం వెనక కారణం తెలియగానే అంతా నోరెళ్లబెడుతున్నారు. కెరీర్ కోసం అందం కోసం మోడల్స్ ఎంత పెద్ద రిస్క్ తీసుకుంటారో ఈ ఘటన బయటపడేలా చేసింది. అందం కోసం ఆరాటంలో ఈ మరణం నిజంగానే కలచివేస్తోంది. అందం కోసం ఏకంగా ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే ఇక్కడ ఆశ్చర్యపరుస్తోంది. ఇలాంటి అసహజ మరణం ఊహించలేం అంటూ నెటిజనులు కామెంట్లు చేస్తున్నారు.
అర్జెంటీనా(బ్రెజిల్)కు చెందిన మోడల్ కం నటి సిల్వినా లూనా -బ్రెజిలియన్ బట్ లిఫ్ట్ (పిరుదుల ఎత్తు పెంపు సర్జరీ) ప్రక్రియ కారణంగా తలెత్తిన మూత్రపిండాల సమస్యల కారణంగా 79 రోజులు ఆసుపత్రిలో గడిపి 43 ఏళ్ల వయసులో మరణించారు. లూనా ఆగస్ట్ 31 గురువారం మరణించారు. నిజానికి లూనా 79 రోజులుగా హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటోంది. 2011లో జరిగిన శస్త్రచికిత్స ఫలితంగా తలెత్తిన సమస్యలకు చికిత్స పొందిందని ప్రముఖ మీడియా నివేదించింది. స్థానిక వార్తా సంస్థల కథనాల ప్రకారం.. నటి లూనా సోదరుడు ఎజెక్విల్ లూనా గురువారం మధ్యాహ్నం తన సోదరిని వెంటిలేటర్ నుండి తొలగించడానికి వైద్యులకు అనుమతినిచ్చాడు. సిల్వినా న్యాయవాది ఫెర్నాండో బుర్లాండో ఈ మరణంపై వ్యాఖ్యానిస్తూ.. ``విషాదకరమైన నష్టం..`` అని అన్నారు. నొప్పి, బాధ కలిగించే ముగింపు అని కూడా వ్యాఖ్యానించారు. సిల్వినా లూనా యుద్ధం అధికారులను మేల్కొలపాలని, తద్వారా సమాజానికి మేలుకొలుపు అవుతుందని ఇక మరణాలు ఉండవు అని ఆశిస్తున్నట్టు ఆశాభావం వ్యక్తం చేసారు.
అందం పెంచుకునే చికిత్స లేదా సర్జరీ జూన్ లేదా జూలై 2011లో జరిగింది. దీనిని కాస్మెటిక్ సర్జన్ అనిబాల్ లోటోకి నిర్వహించారు. డాక్టర్ లోటోకీపై అంతకుముందు కూడా ఫిర్యాదులు ఉన్నాయి. 2010లో ఆపరేషన్ చేసిన రోగి 2021లో మరణించినట్లు అభియోగాలు మోపారు. అర్జెంటీనా నేషనల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ డ్రగ్స్, ఫుడ్ అండ్ మెడికల్ టెక్నాలజీ ద్వారా నిషేధించబడిన పాలీమిథైల్మెథాక్రిలేట్ ఉన్న లిక్విడ్‌ని సిల్వినాకు సదరు డాక్టర్ ఇంజెక్ట్ చేశాడు.
సిల్వినా 2015లో మూత్రపిండాల్లో రాళ్లతో చికిత్స పొందినప్పుడు ఆమెకు వైద్య సహాయం అవసరం పడింది. వైద్యులు ఆమెకు మూత్రపిండ లోపం హైపర్‌కాల్సెమియాతో బాధపడుతున్నారని నిర్ధారించారు. కిడ్నీ మార్పిడి అందుబాటులోకి వచ్చే వరకు ఆమెకు వారానికోసారి డయాలసిస్ చికిత్సలు చేయించారు. 2016లో ఆమె మయామికి వెళ్లింది. అక్కడ ఆమె అర్జెంటీనా వైద్యుడు క్రిట్సిటన్ పెరెజ్‌ను కలుసుకుంది, ఆమె పిరుదుల నుండి ప్రమాదకరమైన పదార్థాన్ని అతడు తొలగించారు. అనంతరం ప్రముఖ మీడియాతో మాట్లాడుతూ డా.క్రిట్సిసన్ ఇలా వివరించాడు. సిల్వినా తన శస్త్రచికిత్సల పర్యవసానంగా ఔషధాల వల్ల స్వయం ప్రతిరక్షక వ్యాధిని అభివృద్ధి చేసింది. రోగులంతా నిజానికి తీవ్రమైన మూత్రపిండ వైఫల్యాన్ని అభివృద్ధి చేస్తారు..చివరికి మరణిస్తారు.. అని కామెంట్ చేసారు. సిల్వినా మెడికల్ హిస్టరీ పరిశీలిస్తే జూన్ 13న తనను ఆసుపత్రిలో చేర్చారు. జూన్ 29 వరకు ఆమెను వెంటిలేటర్ నుండి తొలగించే వరకు దాదాపు రెండు వారాల పాటు మత్తులో ఉంచారు. ఆగష్టు 19 న ఆసుపత్రి సిల్వినా కినియోలాజికల్, న్యూట్రిషనల్ అండ్ సైకలాజికల్ పునరావాసంతో తనంతట తానుగా శ్వాస తీసుకుంటోంది! అని ఆస్పత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. కానీ ఇటీవలి రోజుల్లో ఆమెకు బ్యాక్టీరియా సోకింది. మరుసటి రోజు లైఫ్ సపోర్టును తీసివేయడానికి ముందు ఆగస్ట్ 30 బుధవారం మరోసారి ఇంట్యూబేట్ చేసారు. కానీ చివరికి ఆమె మరణించింది.
బ్యూనస్ ఎయిర్స్ అటార్నీ జనరల్ కార్యాలయం సిల్వినా మరణంపై దర్యాప్తు ప్రారంభించింది. శవపరీక్ష కోసం ఆమె శవాన్ని సిటీ మార్చురీకి పంపాలని ఆదేశించింది. నటి కం మోడల్ మరణం... TV హోస్ట్ కం ఫ్యాషన్ నిపుణురాలు మరియానో కాప్రారోలాకు 2010లో డాక్టర్ లొటో బట్ లిఫ్ట్ సర్జరీ చేసారు. సంబంధిత సమస్యలతో ఆమె మరణించిన రెండు వారాల తర్వాత ఫిబ్రవరి 2022లో సిల్వినా మరియు మరో ముగ్గురు మహిళలు ఇలాంటి సమస్యలనే ఎదుర్కొన్నారు. దీంతో వైద్యపరమైన దుర్వినియోగంపై దావా కారణంగా డాక్టర్ లోటోకీకి నాలుగు సంవత్సరాల జైలు శిక్షను కోర్టు విధించింది. జూలైలో న్యాయస్థానం అతను ఐదేళ్లపాటు మెడిసిన్ ప్రాక్టీస్ చేయకుండా నిషేధించింది. అయితే సదరు సర్జన్ కటకటాల వెనుక లేడు.. నేషనల్ ఛాంబర్ ఆఫ్ క్రిమినల్ అప్పీల్స్ అతని శిక్షను సమీక్షిస్తున్నప్పుడు అతడు స్వేచ్ఛగా బయటే ఉన్నాడు. ఇప్పుడు సిల్వినా మరణంతో అతడిని కారాగారం ఊచల్లోకి గెంటనున్నారని