తగిలినందుకు ఫుల్ గా క్లాస్ పీకిన హీరో!

Update: 2018-09-12 04:43 GMT
అక్కినేని నాగచైతన్య కెరీర్ లో '100% లవ్' ఒక సూపర్ హిట్ ఫిలిం మాత్రమే కాదు ఒక మెమొరబుల్ సినిమా.  గీతా ఆర్ట్స్ నిర్మాణంలో సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చైతు కు జంటగా తమన్నా నటించింది. ఇప్పుడు ఈ సినిమా తమిళం లో '100% కాదల్' పేరుతో తెరకెక్కుతోంది.  జీవీ ప్రకాష్ కుమార్ - షాలిని పాండే లు హీరో హీరోయిన్లు.

రీసెంట్ గా  '100% కాదల్' టీమ్ ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేసింది.  ఒరిజినల్ సినిమాను తమిళం లో కూడా దాదాపుగా ఫాలో అయ్యారు. జస్ట్ 19 సెకన్లె ఉన్న ఈ టీజర్ లో బైక్ లో హీరో హీరోయిన్ లు వెళ్తున్నప్పుడు హీరోయిన్  హీరో మీద పడిందని క్లాస్ పీకుతాడు.  సేమ్ తెలుగు లోలాగానే 'బైక్ లైట్ గా జంప్ అయింది నువ్వేమో గట్టిగావచ్చి నామీద పడ్డావు.. నీ ఎద నాకు తగిలింది. నీ ఊపిరి వేడిగా నాకు తగిలింది. నీ హార్ట్ బీట్ చాలా స్పీడ్ గా ఉంది. నువ్వు ఏదో ఫీలయ్యావు.. దీన్నే ఇన్ఫాచుయేషన్ అంటారు." అని క్లాస్ ఇస్తాడు.

అంతా బాగానే ఉంది కానీ ఎందుకో తెలుగులో ఉన్న ఆ ఫీల్ మిస్సయిందని చాలామంది అంటున్నారు.  ఇది మేమనడం కాదు బాబోయ్..  టీజర్ కింద వచ్చిన కామెంట్స్ ను చూస్తే మీకే అర్థం అవుతుంది. ఒక నెటిజన్ పెట్టిన కామెంట్ చూడండి "అడపావిగళా.. బెంగుళూర్ డేస్ మాదిరి 100% లవ్ వుమ్ మొక్క పణిటింగళా డా".. రఫ్ గా తెలుగులో చెప్పుకుంటే బెంగుళూర్ డేస్ సినిమా ని చేసినట్టు 100% లవ్ ను కూడా ఖైమా కొట్టారా???

 విమర్శలు ఎప్పుడూ ఉండేవేగా.. ఆవన్నీ పక్కన బెట్టి టీజర్ పై మాత్రం ఓ లుక్కేయండి.

వీడియో కోసం క్లిక్ చేయండి

Full View


Tags:    

Similar News