#SSMB 29 కి 1000 కోట్లు బ‌డ్జెట్!

Update: 2023-02-23 08:00 GMT
#ఎస్ ఎస్ ఎంబీ 29వ చిత్రం పాన్ వ‌ర‌ల్డ్ రేంజ్ లో ద‌ర్శ‌క దిగ్గ‌జం  రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. గ్లోబ్ ట్రాటింగ్ అడ్వంచ‌రస్ గా మ‌లుస్తున్నారు. ఇండియాలో ఇలాంటి సినిమా రావ‌డం ఇదే తొలిసారి. ఆప్రిక‌న్ అడ‌వుల నేప‌థ్యంలో సాగే అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్ ప్రేక్ష‌కుల ముంద‌కు రానుంది. ఈ రెండు ప్ర‌క‌ట‌న‌ల‌తోనే సినిమాపై అంచ‌నాలు స్కైని మించి క‌నిపిస్తున్నాయి.

మ‌రోవైపు 'ఆర్ ఆర్ ఆర్' ఆస్కార్ కి నామినేట్ అవ్వ‌డంతో జ‌క్క‌న్న‌పై ఎక్స్ ప‌క్టేషన్స్ అంత‌కంత‌కు పెరుగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఎస్ ఎస్ ఎంబీ29వ సినిమాకి సంబంధించి ఓ వార్త నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

ఈ సినిమాని ఏకంగా 100 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మిస్తున్న‌ట్లు ప్ర‌చారం సాగుతోంది. ఏకంగా 30 భాష‌ల్లో ఓటీటీ ద్వారా ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొచ్చేలా జ‌క్క‌న్న ప్లాన్ చేస్తున్నారుట‌. టాప్ కార్పోరేట్ కంపెనీల‌తో ట‌చ్ లో ఉన్న‌ట్లు స‌మాచారం

అంటే థియేట్రిక‌ల్ రిలీజ్ ఇంకే రేంజ్ లో  ఉంటుందో చెప్పాల్సిన ప‌నిలేదు.  దానికి సంబంధించి బ్యాకెండ్ ప్లానింగ్ జ‌క్క‌న్న టీమ్ చేస్తుందిట‌. ఇప్ప‌టివ‌ర‌కూ పాన్ ఇండియానా?  పాన్ వ‌ర‌ల్డ్ నా? అని చిన్న సందేహం ఉండేది. తాజా అప్డేట్ ని బ‌ట్టి ఇది ప‌క్కా పాన్ వ‌రల్డ్ చిత్రంగా దాదాపు క‌న్ప‌మ్ చేయోచ్చు.

దీంతో మ‌హేష్ రేంజ్ ప్ర‌పంచానికి తెలిసే అవ‌కాశం ఉంది. ఆర్ ఆర్ ఆర్  ఆస్కార్ నామినేష‌న్ బ‌రిలో నిలిచిన శుభ సంద‌ర్భంలో మ‌హేష్ సినిమాపై   కొత్త‌ ప్ర‌చారం అభిమానుల్లో మ‌రింత జోష్ ని నింపుతుంది. మ‌రి ఈ ప్ర‌చారంలో నిజ‌మెంతో అతి త్వ‌ర‌లోనే క్లారిటీ వ‌స్తుంది. రాజ‌మౌళి అమెరికా నుంచి తిరిగి రాగానే ఈ సినిమా ప‌నుల్లోనే బిజీ అవుతారు.

దీంతో 1000 కోట్ల బ‌డ్జెట్ వెనుక అస‌లు క‌హాని కూడా బ‌య‌ట‌కు వ‌స్తుంది. ఇదే నిజ‌మైతే దీన్నిఓ చ‌రిత్ర‌గానే భావించాలి. ఇండియాలో ఇంత వ‌ర‌కూ 1000 కోట్ల బ‌డ్జెట్ తో ఏ సినిమా నిర్మాణం జ‌ర‌గ‌లేదు. బాలీవుడ్ కూడా ఏనాడు ఇంత సాహ‌సానికి పూనుకోలేదు. ఆ ర‌కంగా టాలీవుడ్ దేశంలో అగ్ర‌ప‌ధాన నిల‌బ‌డుతుంని చెప్పొచ్చు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News