మిల్కీ బ్యూటీ తమన్నా ఇటీవలే 11త్ అవర్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ప్రవీన్ సత్తారు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ ను ఆహా వారు స్ట్రీమింగ్ చేయబోతున్నారు. తమన్నా వంటి స్టార్ హీరోయిన్ వెబ్ సిరీస్ లో నటిస్తున్న కారణంగా అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఈ వెబ్ సిరీస్ ను దర్శకుడు ప్రవీణ్ సత్తారు విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందిస్తున్నట్లుగా యూనిట్ సభ్యులు పేర్కొన్నారు.
కరోనా మహమ్మారి సమయంలోనే ప్రారంభం అయిన ఈ వెబ్ సిరీస్ అప్పుడే షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటీవలే ఆహా వేడుకలో ఈ వెబ్ సిరీస్ గురించి యూనిట్ సభ్యులు మాట్లాడుతూ చాలా విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందుతున్నట్లుగా ప్రకటించారు. తాజాగా షూటింగ్ పూర్తి అయినట్లుగా తమన్నా ఫొటో పోస్ట్ చేసింది. ఈ టీమ్ ను నేను మిస్ అవుతాను అంటూ తమన్నా కాస్త ఎమోషనల్ గా షేర్ చేసింది. నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చే నెలలో ఆహా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.