బాహుబలి చిత్రం తర్వాత ప్రభాస్ చేస్తున్న సినిమాలపై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఆయన సినిమాలను అత్యంత రిచ్ గా చిత్రీకరిస్తున్నారు. సాహో చిత్రాన్ని ఒక హాలీవుడ్ సినిమా రేంజ్ లో చిత్రీకరించిన విషయం తెల్సిందే. యూవీ క్రియేషన్స్ వారు బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా సాహోను నిర్మించారు. ఆ సినిమా ఫలితం గురించి పక్కన పెడితే నిర్మాణాత్మక విలువల పరంగా ఇండియన్ సినిమాల్లో టాప్ ప్లేస్ లో నిలిచిందని చెప్పుకోవచ్చు. ఇక ప్రస్తుతం రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ ఓ డియర్ చేస్తున్నాడు.
‘ఓ డియర్’ చిత్రం కూడా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది. 1980 కథతో యూరప్ బ్యాక్ డ్రాప్ తో ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. సాహో స్థాయిలో కాకున్నా ఈ చిత్రానికి భారీగా ఖర్చు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. సినీ వర్గాల్లో వినిపిస్తున్న తాజా వార్తల అనుసారం ఈ చిత్రం కోసం ఒక మార్కెట్ సెట్ వేశారు. రెండు కోట్ల రూపాయలతో ఆర్ట్ డైరెక్టర్ రవీందర్ రెడ్డి పది రోజులు 150 మందితో కష్టపడి వేయించాడట. రెండు కోట్లతో వేసిన ఆ సెట్ లో చిత్రీకరణ చేసేది కేవలం రెండు రోజులు మాత్రమేనట.
గూండాలను తరుముతూ ఆ మార్కెట్ లో చాలా సేపు ప్రభాస్ పరిగెత్తుతూ ఉంటాడట. అందుకోసం ఏకంగా రెండు కోట్ల రూపాయలతో ఆ సెట్ ను నిర్మించినట్లుగా తెలుస్తోంది. 1980 పరిస్థితులు కనిపించేలా అప్పటి వాతావరణం ఉండేలా ఆ మార్కెట్ ను క్రియేట్ చేసేందుకు అంత ఖర్చు అయ్యిందని యూనిట్ సభ్యులు అంటున్నారు. మొత్తానికి ఈ సినిమా నిర్మాణాత్మక విలువల పరంగా మరో సాహోను చూపించబోతుందేమో అంటూ ప్రభాస్ ఫ్యాన్స్ అంటున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ఈ ఏడాది దసరాకు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉగాదికి ఫస్ట్ లుక్ రాబోతున్న నేపథ్యంలో విడుదల తేదీ విషయంలో కూడా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.