ప్రభాస్ సాహో చిత్రం యావరేజ్ టాక్ దక్కించుకున్నా కూడా భారీ వసూళ్లను దక్కించుకున్నదన్న నమ్మకంతో యూవీ క్రియేషన్స్ వారు ప్రస్తుతం ప్రభాస్ 20 చిత్రానికి భారీగా ఖర్చు చేస్తున్నారు. సినీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే 130 కోట్లకు పైగా ఖర్చు చేశారట. షూటింగ్ ఇంకా బ్యాలన్స్ ఉంది. విదేశాల్లో దాదాపుగా 20 రోజుల పాటు షూటింగ్ చేయాల్సి ఉంది. అలాగే ఇక్కడ కూడా ఒక షెడ్యూల్ బ్యాలన్స్ ఉంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇంకా 30 నుండి 40 కోట్ల వరకు ఖర్చు చేయాల్సి ఉందట.
మొత్తంగా ఈ చిత్రం బడ్జెట్ 200 కోట్ల వరకు అయ్యే అవకాశం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. సాహో చిత్రం తరహాలో వసూళ్లు రాబడితే పాన్ ఇండియా లెవల్ లో విడుదలై యావరేజ్ టాక్ దక్కించుకున్నా ఈ మొత్తంను ఈజీగానే ప్రభాస్ రాబట్టగలడు. కాని ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో సినిమా ఇంతగా వసూళ్లు చేయగలదా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సాహో చిత్రం బాలీవుడ్ లో ఎక్కువ వసూళ్లు చేసింది. అక్కడి వారు మెచ్చే యాక్షన్ సీన్స్ సాహోలో కుప్పలు తెప్పలుగా ఉండటం వల్ల వారు సినిమాకు బ్రహ్మరథం పట్టారు.
ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఆ రేంజ్ లో ఉండవు. కనుక కంటెంట్ సూపర్బ్ గా ఉంటేనే వారు ఆధరించే అవకాశం ఉంది. ఇక కరోనా విపత్తు నుండి బయట పడటం అలాగే దాని భయం నుండి బయట పడటం ఇప్పట్లో సాధ్యం అయ్యే పని కాదంటున్నారు. కనుక ఇదే ఏడాది ప్రభాస్ 20 చిత్రం రాథేశ్యామ్ విడుదల అయితే బ్రేక్ ఈవెన్ సాధించడం అంత సులభం కాదని.. సినిమా ముందు చాలా పెద్ద లక్ష్యం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రం ఆయనకున్న స్టార్ డం తో ఈజీగా 200 కోట్లను రాబట్టగలడనే నమ్మకంను వ్యక్తం చేస్తున్నారు. మేకర్స్ కూడా ఇదే నమ్మకంతో భారీ బడ్జెట్ ను పెడుతున్నారు.