టాలీవుడ్ సినిమాలకు సంక్రాంతి అతి పెద్ద సీజన్. ఈ సీజన్లలో జరిగే బిజినెస్ మరే సీజన్లో కూడా జరగదు. ఈ ఏడాది మహేష్ బాబు.. అల్లు అర్జున్ సినిమాలు భారీ పోటీలో కూడా కలెక్షన్ల పంట పండించాయి. బాక్స్ ఆఫీసుకు పండగ సందడిని తీసుకొచ్చాయి. ఈ పోటీనే తీవ్ర స్థాయిలో ఉండడంతో జనాలకు దాదాపుగా పిచ్చెక్కింది. ఇదే ఇలా ఉంటే వచ్చే ఏడాది సంక్రాంతి సినిమాల పోటీ కనీవినీ ఎరుగని రీతిలో ఉండబోతోందని అంటున్నారు.
దేశవ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రాజమౌళి చిత్రం 'RRR' ను జనవరి 8 వ తారీఖున విడుదల చేస్తామని నిన్నే నిర్మాతలు ప్రకటించారు. 'బాహుబలి' ఫ్రాంచైజీ సినిమాల తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. భారీ బడ్జెట్ సినిమా కావడంతో సోలో రిలీజ్ తప్పదు. అయితే మిగతా సీజన్ల లో ఈ సినిమా కు పోటీగా రిలీజ్ చెయ్యకుండా కనీసం రెండు మూడు వారాలు గ్యాప్ ఇచ్చే వారేమో కానీ సంక్రాంతి సీజన్ ను ఇతర ఫిలిం మేకర్లు వదులుకునేందుకు సిద్ధంగా లేరట.
2021 సంక్రాంతికి పవన్ కళ్యాణ్.. మహేష్ బాబు సినిమాలు బరిలో నిలవబోతున్నాయని సమాచారం అందుతోంది. పవన్ కళ్యాణ్ రీ-ఎంట్రీ సినిమా 'పింక్' రీమేక్ ఈ మేలో రిలీజ్ కానుంది. అయితే పవన్ - క్రిష్ కాంబినేషన్లో తెరకెక్కనున్న పీరియడ్ ఫిలింను వచ్చే సంక్రాంతి కి రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట. ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా స్థాయి లో రిలీజ్ చేసే ఆలోచన ఉందని అంటున్నారు.
ఈ ఏడాది 'సరిలేరు నీకెవ్వరు' తో సంక్రాంతి బారిలో నిలిచిన సూపర్ స్టార్ మహేష్ బాబు వచ్చే ఏడాది సంక్రాంతి కి తన సినిమా ఉండాలని ప్లాన్ చేస్తున్నారట. వంశీ పైడిపల్లి దర్శకత్వం లో తెరకెక్కనున్న ఈ సినిమాకు ఇప్పటికే పకడ్బందీగా స్క్రిప్ట్ తయారు చేశారట. వచ్చే సంక్రాంతికి మహేష్ ను విజేతగా నిలపాలనే ఆలోచనలో వంశీ ఉన్నాడట. 'RRR' జనవరి 8 న రిలీజ్ అయితే ఈ రెండు సినిమాలు మూడు నాలుగు రోజుల గ్యాప్ తర్వాత రిలీజ్ అవుతాయి. ఈలెక్కన థియేటర్ల విషయంలో భారీ పోటీ నెలకొంటుందని.. సంక్రాంతి సందడి పీక్స్ లో ఉంటుందని చెప్పడంలో ఏమాత్రం అనుమానం లేదు. అయితే ఈ పోటీలో ఎవరు విజేత గా నిలుస్తారో చెప్పడం మాత్రం కష్టమే.