ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో బాక్సాఫీస్ సినిమాలు ఇండస్ట్రీకి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి అని చెప్పాలి. ఒక విధంగా బాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీ కంటే ఈ ఏడాది టాలీవుడ్ సక్సెస్ రేట్ మరింత ఎక్కువగా పెరిగింది. అయితే 2022లో కొంతమంది సీనియర్ దర్శకులు మాత్రమే కాకుండా కొత్తగా వచ్చిన టాలెంటెడ్ దర్శకులు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద నిర్మాతలకు మంచి ప్రాఫిట్స్ అందించారు.
మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకొని వారి కెరీర్ను సరైన ట్రాక్లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఏడాది మొదటగా డీజే టిల్లు సినిమాతో విమల్ కృష్ణ బాక్స్ సక్సెస్ అందుకున్నాడు. ఆ సినిమాలో హీరో డైలాగ్ డెలివరీ బాడీ లాంగ్వేజ్ ను అద్భుతంగా ప్రజెంట్ చేసిన విమల్ దర్శకుడుగా సక్సెస్ అయ్యాడు. అలాగే చాలా సింపుల్ లవ్ స్టోరీ గా వచ్చిన అశోక వనంలో అర్జున కల్యాణం సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ అందుకుంది.
ఈ సినిమాకు ఫలక్ నుమా దాస్ సినిమాటోగ్రాఫర్ విద్యాసాగర్ దర్శకత్వం వహించాడు. అతని మేకింగ్ విధానం ఫ్యామిలీ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది. బాంబిసార దర్శకుడు వశిష్ట బాక్సాఫీస్ వద్ద బీభత్సం సృష్టించాడు.
కొత్త దర్శకుడు అయినప్పటికీ కూడా ఫాంటసీ బ్యాక్ డ్రాప్ లో క్రియేట్ చేసిన డ్రామా అన్ని వర్గాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అంతే కాకుండా ఆ సినిమా కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే మొదటిసారి 50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న సినిమా గా నిలిచింది.
అలాగే పెద్దగా అంచనాలు హడావిడి లేకుండా వచ్చిన ఒకే ఒక జీవితం కూడా బాక్సాఫీస్ వద్ద పెట్టిన పెట్టుబడికి మంచి ప్రాఫిట్స్ అందించింది. దర్శకుడు శ్రీ కార్తిక్ టైం ట్రావెల్ నేపథ్యంలో ఒక ఎమోషనల్ డ్రామాను చూపించిన విధానం ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇక ఈ ఏడాది బెస్ట్ హారర్ మూవీ గా మసూద నిలిచింది. ఇంతకుముందు వచ్చిన హారర్ మూవీస్ కంటే విభిన్నంగా వచ్చిన ఈ సినిమాకు కొత్త దర్శకుడు సాయికిరణ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా కూడా పెట్టిన పెట్టుబడికి బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ప్రాఫిట్స్ అందించింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.