24 అంత నష్టాలను మిగిల్చిందా?

Update: 2016-07-02 12:40 GMT
24 మూవీతో కోలీవుడ్ హీరో ఓ సంచలనమే సృష్టించాడు. ఇలాంటి విభిన్నమైన చిత్రాన్ని యాక్సెప్ట్ చేయడమే సంచలనం అని.. దాన్ని నిర్మించి మరో సాహసం చేశాడనే పేరు తెచ్చుకున్నాడు. ఇక దర్శకుడు విక్రమ్ కె కుమార్ కూడా.. సంక్లిష్టమైన స్క్రీన్ ప్లేని సింపుల్ గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు. ఇంత చేసినా 24కి మూవీ భారీగానే నష్టపోయింది. 24 కి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్.. 54.54 కోట్ల షేర్ వచ్చింది.

తెలుగు - తమిళ్ రెండు వెర్షన్లను కలుపుకుంటే వచ్చే మొత్తం ఇది. డిస్ట్రిబ్యూషన్ రేట్ల ప్రకారం చూసుకుంటే.. ఈ చిత్రాన్ని భారీ ఫ్లాప్ అనాల్సిందే. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చినా సరే.. ఫ్లాప్ అనేందుకు కారణం.. ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ విలువ ప్రపంచవ్యాప్తంగా 75కోట్లకు పైగానే ఉంది. అంత మొత్తానికి అమ్మితే.. తీరా వచ్చిన మొత్తం 55 కోట్లను కూడా తాకలేదు. విచిత్రం ఏంటంటే.. ఏపీ - తెలంగాణల్లోనే 15.4 కోట్ల షేర్ వచ్చింది. తమిళ నాడులో ఇది 16 కోట్లు మాత్రమే. రెస్టాఫ్ ఇండియా - ఓవర్సీస్ కలెక్షన్స్ ను కూడా కలిపి పరిశీలిస్తే.. తెలుగు వెర్షన్ కే ఎక్కువ కలెక్షన్స్ రావడం విశేషం.

తెలుగు 24 వరకూ ఈ మూవీని సక్సెస్ కిందే పరిగణించినా.. తమిళ్ వెర్షన్ అయితే డిజాస్టర్ కిందే లెక్క. కానీ తెలుగు వెర్షన్ కి మంచి లాభాలు రావడంతో.. చివరకు ఫ్లాప్ కేటగిరిలోకి చేరింది. మంచి సినిమా అని ఆడియన్స్ మాత్రాన హిట్ కావాల్సిన పని లేదని 24 ప్రూవ్ చేసినట్లయింది. 
Tags:    

Similar News