దేశంలోనే మొదటి సీజీ సినిమాకు పాతిక ఏళ్లు

Update: 2020-11-24 13:00 GMT
సినిమా పరిశ్రమ ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీతో ముందుకు దూసుకు వెళ్తుంది. ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా అత్యంత సులువుగా గ్రాఫిక్స్‌ ను ఇప్పుడు చేయవచ్చు. కాని ఒకప్పుడు డబుల్‌ రోల్‌ చూపించాలంటేనే చాలా కష్టంగా ఉండేది. కాని ఇప్పుడు డబుల్‌ రోల్‌ అనేది మొబైల్ లో కూడా చిత్రీకరించి క్రియేట్‌ చేసేంత టెక్నాలజీ వచ్చింది. కాని పాతిక సంవత్సరాల క్రితం తెలుగు ప్రేక్షకులకు కనీసం గ్రాఫిక్స్‌ అనే పదం కూడా తెలిసి ఉండదు. అలాంటి సమయంలో నిర్మాత శ్యామ్‌ ప్రసాద్‌ రెడ్డి అమ్మోరు సినిమాను సీజీ టెక్నాలజీతో రూపొందించారు.

ఇండియాలో మొదటి సీజీ వర్క్‌ జరుపుకున్న సినిమాగా అమ్మోరు నిలిచింది. రీల్‌ తో చిత్రీకరించిన సినిమాకు గ్రాఫిక్స్‌ అంటే చాలా చాలా కష్టం. చిత్రీకరణ కంటే గ్రాఫిక్స్‌ వర్క్‌ కు ఎక్కువ ఖర్చు అవుతుంది. అయినా కూడా వెనక్కు తగ్గకుండా నిర్మాత శ్యామ్‌ ప్రసాద్‌ లండన్‌ లో ఈ సినిమాకు గ్రాఫిక్స్‌ చేయించారు. బ్రిటీష్ కు చెందిన పలువురు టెక్నీషియన్స్‌ ఈ సినిమా కోసం వర్క్‌ చేశారు. ఈ సినిమా గ్రాఫిక్స్‌ వర్క్‌ పూర్తిగా లండన్‌ వారు మాత్రమే చేశారు. తెలుగు సినిమా పరిశ్రమ గురించి అప్పట్లోనే అందరు చర్చించుకునేలా అమ్మోరు నిలిచింది. దేశంలోనే మొదటి సీజీ మూవీగా నిలిచిన అమ్మోరు సినిమా విడుదల అయ్యి పాతిక సంవత్సరాలు అయ్యింది. సౌందర్య కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో రామిరెడ్డి విలన్‌ గా నటించారు. రమ్యకృష్ణ ముఖ్య పాత్రలో కనిపించారు.
Tags:    

Similar News