30 దాటినా.. స్టిల్ సింగిల్

Update: 2017-05-01 17:13 GMT
టీనేజ్ నుంచే హీరోయిన్ గా మారేందుకు చాలామంది అమ్మాయిలు ప్రయత్నిస్తుంటారు. క్రేజ్ రాకపోతే సంగతి వేరు.. కానీ కాసింత గుర్తింపు వస్తే మాత్రం.. స్టార్ అయేందుకు ప్రయత్నిస్తూనే ఉంటారు. స్టార్ అయినా అవకపోయినా.. కొంత భామలు పెళ్లికి దూరంగానే ఉంటారు.

టాలీవుడ్ టాప్ బ్యూటీ అనుష్క వయసు ఇప్పుడు 35 సంవత్సరాలు. కెరీర్ ఆఖరి దశకు వచ్చిందని అనుకుంటున్న సమయంలో మళ్లీ బిజీ అయిన త్రిష ఏజ్ 33 ఏళ్లు. ఖైదీ నంబర్ 150తో తన సత్తా చాటిన కాజల్ అగర్వాల్ కు 31 ఏళ్లు వచ్చేశాయి. మిలీనియం నాటి నుంచే ఇండస్ట్రీలో కొనసాగుతున్న శ్రియా శరణ్ 34 సంవత్సరాలు వచ్చినా పెళ్లి మాటే ఎత్తడం లేదు. కమల్ హాసన్ కూతురుగా ఎంట్రీ ఇచ్చినా స్వయంగా బోలెడంత ఇమేజ్ సంపాదించుకున్న శృతి హాసన్ వయసు 31 ఏళ్లు. సౌత్ టాప్ బ్యూటీ నయనతారకు ఇప్పుడు 32 ఏళ్లు నిండిపోయాయి. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వెళ్లి కుదురుకున్న టబు 45 ఏళ్లు వచ్చాయ్ కానీ.. పెళ్లి మాట ఎత్తడం లేదు.

వీళ్లే కాదు.. టాలీవుడ్ లో ఒకటి అరా సినిమాలు చేసిన భామలు మరికొంతమంది కూడా ఈ జాబితాలో ఉన్నారు. పవన్ - మహేష్ లతో నటించిన అమీషా పటేల్ కు ఇప్పుడు 40 ఏళ్లు. కంత్రి మూవీలో కనిపించిన తనీషా ముఖర్జీ కి 39 ఏళ్లు వచ్చాయి. అతిథిలో కనిపించిన అమృతారావుకు 35 నిండిపోయాయి. పరమ వీర చక్రతో పాటు మరో రెండు సినిమాల్లో నటించిన నేహా ధూపియా 36 దాటినా పెళ్లి చేసుకోలేదు. ధైర్యంలో నటించిన రైమా సేన్ కు ఇప్పటికే 37 దాటేశాయి. నేను మీకు తెలుసాలో కనిపించిన రియా సేన్ 36 దాటిన ఇంకా పెళ్లి కాని హీరోయినే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News