అర్జంటుగా పబ్లిసిటీ కావాలంటే ఏదో ఒక అడ్డగోలు రూట్ ఎంచుకోవాల్సిందే. ఇప్పుడో తమిళనాడు బిజినెస్ మ్యాన్ కూడా ఇదే చేశాడు. తనకు హీరోయిన్ తో పెళ్లయిందని, తర్వాత ఆమె తనను మోసం చేసిందంటూ బెంగళూరు పోలీసు కమీషనర్ కు ఫిర్యాదు చేసి, చివరకు ఇరుక్కున్నాడు.
హీరోయిన్ మేఘనా రాజ్ మనకు పరిచితమే. బెండు అప్పారావు ఆర్ ఎంపీతో పాటు పలు తెలుగు - తమిళ - కన్నడ సినిమాల్లో నటించిందీమె. తమిళనాడుకు చెందిన జనార్ధన్ వ్యాపారి.. తనకు మేఘనతో పెళ్లయిందని, తనని మోసం చేసి పెళ్లికి సంబంధించిన ప్రూఫ్ లతో పాటు విలువైన వస్తువులతో ఉడాయించిందని బెంగళూరు పోలీసులకు కొన్ని నెలల క్రితం ఈమెయిల్ ద్వారా కంప్లెయింట్ చేశాడు. ఇప్పుడీ కేసు క్లోజయిపోయింది. దీనికి కారణం.. సదరు జనార్ధన్ తనకు మేఘనతో పెళ్లి జరిగిందనే విషయాన్ని నిరూపించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. అంతే కాదు.. అసలు ఆమె ఇల్లు ఎక్కడో చెప్పలేకపోవడం ఆశ్చర్యకరమైన విషయం.
దీంతో పోలీసులు క్లాస్ పీకి అతన్ని వదిలిపెట్టారు. అయితే మేఘన తల్లి ప్రమీల మాత్రం ఈ విషయాన్ని ఓ పబ్లిసిటీ స్టంట్ గా కొట్టిపడేశారు. ఆ జనార్ధన్ ఎవరో కూడా తెలీదని తేల్చి చెప్పారామె. ఇప్పుడు తన పరువు తీశాడంటూ.. హీరోయిన్ మేఘనా రాజ్.. ఈ జనార్ధన్ పై కేసు పెట్టనున్నట్లు