సుప్రసిద్ధ సంగీత దర్శకుడు ఎ.ఆర్.రెహమాన్ తన ట్విట్టర్ పేజీలో షేర్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధానాలను వ్యతిరేకిస్తూ ఆ దేశంలో మానవ హక్కుల కోసం పోరాడే వాలారీ కౌర్ చేసిన ప్రసంగం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది. లక్షలాది మంది ఈ వీడియోను షేర్ చేస్తూ కౌర్ ప్రసంగం గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. ఇమ్మిగ్రేషన్ విధానంలో సంచలన మార్పులు చేస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలపై ప్రపంచవ్యాప్తంగా దుమ్మెత్తిపోస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశాలపై కౌర్ అద్భుత రీతిలో మాట్లాడింది. ఆమె అభిప్రాయాలతో మెజారిటీ జనాలు ఏకీభవిస్తున్నారు.
103 ఏళ్ల కిందట తన తాత అమెరికాకు వలస వచ్చారని.. భారత్ నుంచి ఫసిఫిక్ సముద్రం మీదుగా ఓడలో ప్రయాణించి అమెరికా చేరుకొన్నారని.. ఐతే నల్ల రంగు చర్మంతో తలపై పాగాతో కనిపించిన తన తాతను అమెరికా అధికారులు అవమానించి.. జైల్లో పెట్టారని.. చాలా కాలం జైల్లో మగ్గిన తర్వాత ఓ శ్వేతజాతీయుడి సాయంతోనే ఆయన బయటకు వచ్చారని ఆమె ఈ వీడియోలో పేర్కొంది. నాటి పరిస్థతులతో ప్రస్తుతం పరిణామాల్ని పోలుస్తూ గొప్ప ప్రసంగం చేసింది కౌర్. అమెరికాలో శ్వేతజాతీయుడైన ఓ అబ్బాయి తనను నిందించి ఇండియాకు వెళ్లిపో హెచ్చరించినట్లు ఆమె తెలిపింది. ఈ వీడియోను రెహమాన్ షేర్ చేస్తూ.. ప్రస్తుత పరిణామాలపై తన స్పందన తెలియజేశాడు. ఇందుకు రెహమాన్ కు కౌర్ థ్యాంక్స్ చెప్పింది. రెహమాన్ మాటలు అద్భుతమని పేర్కొంది.
Full View
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/