బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్ హీరోగా తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన లాల్ సింగ్ చడ్డా డిజాస్టర్ గా నిలిచిన విషయం తెల్సిందే. ఆ సినిమాని ఆమీర్ ఖాన్ దాదాపుగా 250 కోట్ల బడ్జెట్ తో రూపొందించారు అంటూ వార్తలు వచ్చాయి. సినిమా విడుదల సమయంలో ఆమీర్ ఖాన్ గత వ్యాఖ్యల కారణంగా వివాదం చెలరేగిన విషయం తెల్సిందే. బాయ్ కాట్ లాల్ సింగ్ చడ్డా అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
లాల్ సింగ్ చడ్డా కోసం ఆమీర్ ఖాన్ దాదాపుగా మూడు సంవత్సరాల పాటు కష్టపడ్డాడు. ఆయన గత సినిమా ఫ్లాప్ అయిన నేపథ్యంలో ఈ సినిమా పై చాలా ప్రత్యేక శ్రద్దను పెట్టాడు. కనుక సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంతా భావించారు. అందుకే సినిమా విడుదల కాకముందే ప్రముఖ ఓటీటీ లు ఈ సినిమాను కొనుగోలు చేసేందుకు గాను ముందుకు వచ్చాయి.
ఆమీర్ ఖాన్ ఈ సినిమా ను ఏకంగా 120 నుండి 125 కోట్ల వరకు డీల్ కుదిరితేనే అమ్మేసేందుకు సిద్ధం అయ్యాడు. కానీ సినిమా విడుదల కాక ముందే అంత భారీ మొత్తంను పెట్టేందుకు ఏ ఒక్క ఓటీటీ ముందుకు రాలేదు. సినిమా ఫలితం ఎలా ఉంటుందో తెలియకుండా అంత భారీ మొత్తాన్ని పెట్టలేం అంటూ ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్ చేతులు ఎత్తేసిందట.
వారు 80 కోట్ల వరకు ఇచ్చేందుకు ఓకే చెప్పారట. కానీ ఆమీర్ ఖాన్ తన సినిమా పై తనకు ఉన్న నమ్మకంతో ఏమాత్రం తగ్గకుండా వంద కోట్లకు కూడా ఇచ్చేది లేదు అంటూ డీల్ ను వదిలేశాడట. పైగా సినిమా థియేట్రికల్ రిలీజ్ అయిన ఆరు నెలల వరకు ఓటీటీ స్ట్రీమింగ్ చేయకూడదు అని కండీషన్ ను కూడా ఆమీర్ ఖాన్ పెట్టాడట.
ఇప్పుడు ఆమీర్ ఖాన్ కండీషన్స్ ఆయన సినిమాకు పెద్ద చేటు ను తెచ్చి పెట్టాయి. సినిమా డిజాస్టర్ గా నిలవడంతో ఓటీటీ లు కనీసం 50 కోట్లు పెట్టేందుకు కూడా ముందుకు రావడం లేదు అంటూ బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆమీర్ ఖాన్ ఇప్పుడు రెంటికి చెడ్డ రేవడు అన్నట్లుగా మారిపోయాడు అంటూ బాలీవుడ్ లో చర్చించుకుంటున్నారు.