అమీర్ బిచ్చగాడా?

Update: 2017-09-16 18:11 GMT
ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లో టాప్ మార్కెటింగ్ ఉన్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క అమీర్ ఖాన్ అనే చెప్పాలి. ఎంత మంది ఖాన్ లు ఉన్నా ఈ ఖాన్ సృష్టించిన బాక్స్ ఆఫీస్ రికార్డులను ఏ మాత్రం టచ్ చేయలేకపోతున్నారు. ఓ వైపు యాక్షన్ తరహా సినిమాలను చేస్తూనే నటనపరంగా ప్రయోగాలు కూడా చేస్తున్నాడు అమీర్. అంతే కాకుండా ఫిట్ నెస్ లో కూడా ఈ బడా హీరో ఏ హీరో చెయ్యని విధంగా ప్రయోగాలు చేస్తున్నాడు. ఆ విషయం దంగల్ సినిమా చూస్తే ఎవ్వరికైనా అర్ధమవుతుంది.

దంగల్ తో ఇండియాలోనే కాకుండా చైనాలోను రికార్డులను బద్దలు కొట్టి ఆ దేశ ప్రదనినే మెప్పించిన ధీరుడు అమీర్ ఖాన్. అయితే ఇప్పటివరకు వచ్చిన చిత్రాలకు భిన్నంగా మరొక సరికొత్త ప్రయోగాత్మకమైన సినిమాతో రాబోతున్నాడు. రీసెంట్ గా ఆ నయా చిత్రం షూటింగ్ ని కూడా స్టార్ట్ చేశాడు. ధూమ్ 3 లాంటి బడా సినిమాను తెరకెక్కించిన విజయ్ కృష్ణ ఆచార్య  దర్శకత్వంలో "థగ్స్‌ ఆఫ్‌ హిందుస్థాన్‌" అనే యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్ తో థ్రిల్ చేయడానికి రెడీ అవుతున్నాడు. మొన్నటివరకు సినిమాకోసం చిత్ర యూనిట్ వర్క్ షాప్ లో కూడా చాలా బిజీగా గడిపింది.

అయితే సినిమా మొదలైన రోజు అమీర్ ఖాన్ ఫోటో ఒకటి ప్రస్తుతం నెట్ లో హల్ చల్ చేస్తోంది. ఎందుకంటే అమీర్ చింపిరి జుట్టుతో చినిగిపోయిన బట్టలు వేసుకొని బిచ్చగాడికంటే దారుణంగా కనిపిస్తున్నాడు. అసలు అమీర్ స్థాయికి ఈ పాత్ర సెట్ అవ్వకపోయినా తన నటనతో సినిమాలో తప్పకుండా ఆకట్టుకుంటాడాని చిత్ర యూనిట్ నమ్మకంతో ఉంది. అలాగే సీనియర్ నటుడు అమితాబ్ కూడా ఈ సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నారు. కత్రినా కైఫ్‌ మరియు ఫాతిమా సనా షేక్ హీరోయిన్స్. దాదాపు 210 కోట్లతో ప్రముఖ నిర్మాత ఆదిత్య చోప్రా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.వచ్చే ఏడాది దీపావళికి ఈ సినిమా రిలీజ్ కానుంది.
Tags:    

Similar News