తాను ఎంపిక చేసుకునే సినిమాలకు సంబంధించి బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. రీల్ లైఫ్ కి.. రియల్ లైఫ్ కు ఏ మాత్రం సంబంధం ఉండదన్న విషయాన్ని చెప్పే ప్రముఖ నటుల మాటలకు భిన్నంగా అభిషేక్ బచ్చన్ మాటలు ఉండటం గమనార్హం. తాను తండ్రిని అయ్యాక తాను ఎంపిక చేసుకునే సినిమాల విషయంలో మార్పు వచ్చినట్లు చెప్పటమే కాదు.. సినిమాకు సైన్ చూసే ముందు రొమాంటిక్ సీన్లను చేయలేనని చెబుతున్నట్లు చెప్పి షాకిచ్చారు.
ఎందుకంటే.. తాను అలాంటి సీన్లలో నటించటం ద్వారా తన కుమార్తె ఆరాధ్యనుఇబ్బంది పెట్టటం ఇష్టం లేదన్నారు. అదే సమయంలో తాను ఇబ్బంది పడుతున్నట్లుగా చెప్పి అందరిని ఆశ్చర్య పోయేలా చేశారు. ఆన్ స్క్రీన్ మీద కనిపించే కెమిస్ట్రీ అంతా ప్రొఫెషన్ లో భాగమే తప్పించి.. అవేమీ తమ ప్రైవేటు జీవితాల్లోకి రావన్న మాటను సినీ నటులు తరచూ చెబుతుంటారు. ఇటీవల కాలంలో అభిషేక్ చెప్పినట్లుగా ఎవరూ చెప్పలేదని చెప్పాలి. అంతేకాదు.. బిగ్ బీ లాంటి ఫ్యామిలీ నుంచి వచ్చిన వారి నోటి నుంచి ఇలాంటి మాటల్ని విస్మయానికి గురి చేస్తున్నాయి.
అభిషేక్ వెల్లడించిన అభిప్రాయం ఆయన వ్యక్తిగతం కాబట్టి.. అందరూ గౌరవించాల్సిందే.అయితే.. ఇక్కడే ఒక సందేహం వస్తుంది. తాను రొమాంటిక్ సీన్లు చేస్తే తన కుమార్తె ఇబ్బంది పడటం ఇష్టం లేదన్న అభిషేక్.. ఎనిమిదేళ్ల తన కుమార్తె తనను చాలా మార్చినట్లు పేర్కొనటం తెలిసిందే. మరి.. ఇదే పరిస్థితి అభిషేక్ సతీమణి.. స్టార్ హీరోయిన్ ఐశ్వర్య బచ్చన్ కు కూడా వర్తిస్తుంది కదా? అన్న ప్రశ్న తలెత్తక మానదు.
ఎందుకంటే.. నాలుగేళ్ల క్రితం (2016)లో దిల్ హై ముష్కిల్ చిత్రంలో ఐష్ ఒలక బోసిన రొమాంటిక్ సన్నివేశాలు అప్పట్లో హాట్ టాపిక్ గా మారాయి. రీల్ వేరు.. రియల్ వేరన్న మాట తో అప్పట్లో చర్చను ముగించినా.. అభిషేక్ తాజా వ్యాఖ్యలతో.. ఐష్ నట జీవితానికి పరిమితుల గోడలు వచ్చేసినట్లేనా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. అంటే.. ఐష్ నటించే చిత్రాల్లో రొమాంటిక్ సన్నివేశాలు.. కథానాయకుడికి దగ్గరగా ఉండే సన్నివేశాలే ఉండవా? అన్నదిప్పుడు ప్రశ్న. మరి.. దీనికి ఐష్ ఎలాంటి సమాధానం ఇస్తారో చూడాలి.