మిగతా జోనర్లతో పోలిస్తే కామెడీ సినిమాలకో అడ్వాంటేజ్ ఉంటుంది. సినిమాలో ఏమాత్రం కంటెంట్ ఉన్నా కచ్చితంగా లాభాలొస్తాయి. ఓరకంగా ఇదో ఎవర్ గ్రీన్ హిట్ ఫార్ములా. మంచు వారి హీరో విష్ణు కెరీర్ లో సాధించిన హిట్లన్నీ కామెడీ ఫార్ములాతో తెరకెక్కినవే. ఆడోరకం.. ఈడోరకం తరవాత మళ్లీ తనకు అచ్చొచ్చిన కామెడీ జోనర్ లో లేటెస్ట్ గా ఆచారి అమెరికా యాత్ర సినిమా చేశాడు. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రయిలర్ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈమధ్య కాలంలో బ్రహ్మానందం అస్సలు లైమ్ లైట్ లో లేకుండా పోయాడు. చాలాకాలం తరవాత సినిమా మొత్తం కనిపించే ఫుల్ లెంగ్త్ కామెడీ రోల్ లో ఆచారి అమెరికా యాత్రలో కనిపించబోతున్నాడు. ఖండాంతరాలు దాటితే శాస్త్రాలు పలకవురా అంటూ బ్రహ్మానందం డైలాగుతోనే ఈ ట్రయిలర్ స్టార్టవుతుంది. హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ను చూసి తెగ ముచ్చట పడిపోయి ఆమెను ఇంప్రెస్ చేయడానికి ఎప్పుడూ ఊరూ దాటని కృష్ణమాచారి.. అప్పలచారులు ఏకంగా అమెరికాకు ప్రయాణం కట్టి అక్కడ ఎలాంటి తిప్పలు పడతారన్నదే పాయింట్ చుట్టూ ఈ సినిమా సాగుతుంది. వీళ్లిద్దరికి తోడు మరింతమంది కమెడియన్లు పృథ్వి.. పోసాని కృష్ణమురళి.. ప్రవీణ్.. ప్రభాస్ శ్రీను సినిమాలో నవ్వులు బాగానే పూయించారు. హోమం పేరిట విలన్ ఇంట్లో తిష్ఠ వేసి హీరో వాళ్లను బోల్తా కొట్టించాడన్నది మిగతా కథ.
అవ్వడానికి కామెడీ చిత్రమే అయినా యాక్షన్ సీన్లకు లోటేమీ లేదు. సింగం-3లో స్టయిలిష్ విలన్ గా నటించిన ఠాగూర్ అనూప్ సింగ్.. ప్రదీప్ రావత్ ఇందులో విలన్లుగా కనిపిస్తున్నారు. దీనికితోడు ప్రగ్యాజైస్వాల్ గ్లామర్ రోల్ లో అందాలు బాగానే ఆరబోసింది. హీరో విష్ణు బ్రాహ్మణుడి పాత్రలో ఇంచుమించు దేనికైనా రెడీ స్టయిల్ లోనే నటించాడు. బ్రహ్మానందానికి ఇలాంటి రోల్స్ కొట్టిన పిండి. ఆయన పంచ్ డైలాగులు సినిమా నిండా పుష్కలంగా ఉన్నట్టు తెలుస్తూనే ఉంది. డైరెక్టర్ నాగేశ్వర్ రెడ్డి విష్ణుతో ఇంతకుముందు తీసిన దేనికైనా రెడీలో హోమం పేరుతో ఫ్యాక్షన్ ఫ్యామిలీలోకి ఎంటరైతే ఇక్కడ ఫారిన్ ఫ్యామిలీలోకి ఎంటరవుతాడు. కాన్సెప్ట్ పాతదే అయినా కంటెంట్ కొత్తగా ఉంటుందేమో చూడాలి.
Full View