అందుకే విడాకులు అంటూ షాకిచ్చిన నటి

Update: 2021-07-28 04:31 GMT
ఒక జంట విడిపోవాలంటే? దానికి పెద్ద కారణం ఉండాలి. విన్నంతనే.. ఇలాంటి దారుణాలు భరిస్తూ ఎందుకు కలిసి ఉండాలి? విడాకులు తీసుకోవాల్సిందే అన్న భావన కలిగించాలి. సినీ నటీనటులు.. సెలబ్రిటీలు విడాకులు తీసుకోవటం కొత్తేం కాదు. ఆ మాటకు వస్తే.. గతంతో పోలిస్తే.. గడిచిన పదేళ్లలో విడాకులు తీసుకునే ప్రముఖల జంటలు అంతకంతకూ ఎక్కువ అవుతున్నాయి. తాజాగా అలాంటి ఉదంతమే మలయాళ చిత్ర రంగంలో అన్యోన్య జంటగా పేరున్న ముఖేశ్.. మెతిల్ దేవికలు విడిపోతున్న వార్తలు ఇప్పుడు అందరిని షాక్ కు గురి చేస్తున్నాయి.

తమ విడాకులకు కారణం చెప్పిన ఆమె మాటలు మరింత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. వ్యక్తిగత కారణాలతో తాను విడాకులకు అప్లై చేసినట్లుగా ఆమె చెప్పారు. ఈ ఇష్యూలో తన భర్త ముఖేశ్ అభిప్రాయం ఏమిటో తనకు తెలీదని ఆమె పేర్కొన్నారు. మలయాళ నటుడిగా.. రాజకీయ నేతగా ముఖేశ్ సుపరిచితుడు. మెతిల్ దేవిక డ్యాన్సర్ గా మంచి గుర్తింపు ఉన్న వారే.

ముఖేశ్ కు గతంలో పెళ్లి కావటం.. కొంతకాలానికే అతడి భార్య కమ్ నటి సరిత అతడిపై తీవ్రమైన ఆరోపణలు చేస్తూ విడాకులు తీసుకున్నారు. తన భర్త తాగుబోతు అని.. పలువురు అమ్మాయిలతో అతడికి అక్రమ సంబంధం ఉందని ఘాటు ఆరోపణలు చేశారు. వీరిద్దరి విడాకులు 2011లో జరిగాయి. విడాకులు తీసుకున్న రెండేళ్లకు ముఖేశ్ డ్యాన్సర్ మెతిల్ దేవికను పెళ్లాడారు. గడిచిన ఎనిమిదేళ్లుగా వారిద్దరు ఎంతో అన్యోన్యంగా ఉన్నట్లు చెబుతారు. అలాంటిది ఒక్కసారిగా వీరి విడాకుల వ్యవహారం ఆశ్చర్యానికి గురి చేసింది.

ఇంతకై విడాకులకు కారణం ఏమిటన్న విషయంపై మెతిల్ చెబుతున్న కారణం వింటే అవాక్కు అవ్వాల్సిందే. తమ పెళ్లై  ఎనిమిదేళ్లు అవుతున్నా.. తన భర్త తనకింకా అర్థం కావట్లేదని పేర్కొన్నారు. తన భర్త మంచివాడని.. మంచి భర్త మాత్రం కాలేకపోతున్నాడని పేర్కొన్నారు. అందుకే అతడితో తెగ తెంపులు చేసుకోవటానికి  సిద్ధమైనట్లు పేర్కొన్నారు.

వ్యక్తిగత కారణాలతో తాను.. తన భర్త విడాకుల కోసం అప్లై చేశామని.. ఈ నిర్ణయం తీసుకున్నప్పటి నుంచి మాత్రం తాను ఇబ్బందికర పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నట్లుగా పేర్కొన్నారు. ‘అతడి పరువు తీయాలని నేను అనుకోవటం లేదు. రాజకీయ నాయకుడిగా..నటుడిగా అతడి వ్యక్తిగత విషయాల్ని ప్రస్తావించాల్సిన అవసరం లేదు. అతడి మీద వస్తున్న రాజకీయ ఆరోపణల గురించి స్పందించే అవసరం.. ఆసక్తి నాకే మాత్రం లేదు. అతడి మీద ఆవేశంతో విడిపోవటం లేదు’ అని ఆమె స్పష్టం చేశారు. అయితే.. తనకు ఎలాంటి విడాకుల నోటీసులు అందలేదని.. ముఖేశ్ చెప్పటం గమనార్హం. అర్థం కాకపోవటం కూడా విడాకులకు కారణమంటున్న దేవిక వైనం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
Tags:    

Similar News