పెద్దాయన చుట్టూ వివాదాల ఉచ్చు

Update: 2019-04-05 06:34 GMT
తమిళ్ లోనే కాదు తెలుగులో సైతం అశేషమైన పేరు ప్రఖ్యాతులు ఉన్న నటుడు నాజర్. దశాబ్దాల కెరీర్ తో ఇప్పటికీ డిమాండ్ ని కొనసాగిస్తున్న నాజర్ కు లేట్ ఏజ్ లో లేనిపోని తలనెప్పులు వస్తున్నాయి. అతని సోదరుడు జవహర్ ఇటీవలే ఓ వీడియో మెసేజ్ సోషల్ మీడియాలో షేర్ చేసి అందులో తీవ్ర ఆరోపణలు చేశాడు. నాజర్ తన భార్య కమీలా మాట విని తల్లితండ్రులను తోబుట్టువులను వేరు చేసి నిర్లక్ష్యం చేస్తున్నాడని తమ పరిస్థితి ఇప్పుడేమంత బాగాలేదని దానికి కారణం వారిద్దరే అనేలా చాలా విషయాలు పేర్కొన్నాడు.

నడిగర్ సంఘంలో కీలక బాధ్యతల్లో ఉన్న నాజర్ మీద మీడియా ఫోకస్ పెట్టడంతో ఇది కాస్తా రచ్చ అవుతోంది. దీంతో నాజర్ నేరుగా రంగంలో దిగి దీన్ని చల్లార్చే ప్రయత్నం చేస్తున్నారు. నాజర్ భార్య కమీలా కమల్ హాసన్ పార్టీ మక్కల్ నీతి మయం తరఫున సెంట్రల్ చెన్నై నుంచి లోక్ సభ టికెట్ కోసం పోటీ చేస్తోంది. ఇది మనసులో పెట్టుకుని ప్రతిపక్షాలు కావాలని తన తమ్ముడిని రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని రివర్స్ కౌంటర్ ఇచ్చాడు.

తన తమ్ముడు చేసిన ఆరోపణలకు ఎలక్షన్స్ అయ్యాక బదులు చెబుతానని ఇది సరైన సమయం కాదని దాటవేస్తున్నాడు. ఏదైతేనేం మొత్తానికి నాజర్ వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు. టాలీవుడ్ లో వచ్చి ప్రతి పది సినిమాల్లో కనీసం ఐదింటిలో నాజర్ ఉంటారు. ఇక తమిళ్ సంగతి సరేసరి. అంత బిజీ ఆర్టిస్ట్ గా ఉండి ఓ పక్క భార్య తరఫున ప్రచారం మరోపక్క తమ్ముడి గొడవ ఇంకో వైపు నడిగర్ సంఘం వ్యవహారాలు మరోవైపు సినిమాల షూటింగులు. ఇన్ని తట్టుకుని పెద్దాయన నిలబడుతున్నారు అంటే మెచ్చుకోదగ్గ విషయమే
Tags:    

Similar News